షాకింగ్.. ఆకట్టుకోలేకపోయిన జైలర్

రజనీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ జైలర్. ఇక్కడ-అక్కడ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతి చోటా బంపర్ హిట్టయింది ఈ సినిమా. తెలుగులో చాన్నాళ్ల తర్వాత సూపర్ స్టార్ కు సక్సెస్ అందించిన చిత్రం జైలర్.…

రజనీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ జైలర్. ఇక్కడ-అక్కడ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతి చోటా బంపర్ హిట్టయింది ఈ సినిమా. తెలుగులో చాన్నాళ్ల తర్వాత సూపర్ స్టార్ కు సక్సెస్ అందించిన చిత్రం జైలర్. ఇక తమిళనాట ఈ సినిమా రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అలా ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన జైలర్ సినిమా, ఎందుకో బుల్లితెర వీక్షకుల్ని మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అవును.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జైలర్ సినిమాను జెమినీ ఛానెల్ లో ప్రసారం చేస్తే, కేవలం 5.2 టీఆర్పీ వచ్చింది. ఇది షాకింగ్ నంబర్.

ఈమధ్య టీవీ ఆడియన్స్ టేస్ట్ ను అస్సలు గెస్ చేయలేకపోతున్నారు. థియేటర్లలో హిట్టయిన సినిమా టీవీల్లో ఫ్లాప్ అవుతోంది. అస్సలు రేటింగ్ రావడం లేదు. ఇక థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను జనం టీవీల్లో అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు జైలర్ కూడా అదే లిస్ట్ లోకి చేరడం బాధాకరం.

దీపావళి కానుకగా ఈ సినిమాను ఒకేసారి అన్ని భాషల్లో ప్రసారం చేసింది జెమినీ ఛానెల్. ఊహించినట్టుగానే తమిళనాట జైలర్ కు బంపర్ టీఆర్పీ వచ్చింది. అదే సమయంలో తెలుగులో కూడా ఇది ఆకట్టుకోలేకపోయింది.

నెల్సన్ డైరక్ట్ చేసిన జైలర్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయగన్, సునీల్, యోగిబాబు నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.