సిద్దూ శ్రీరామ్ మరో మ్యూజికల్ మ్యాజిక్

మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అంటే ఒకప్పుడు మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఆ బ్యానర్ మళ్లీ సిన్మాల నిర్మాణం ప్రారంభించింది. ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో నిర్మిస్తున్న సినిమా ఇష్క్. యంగ్…

మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అంటే ఒకప్పుడు మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఆ బ్యానర్ మళ్లీ సిన్మాల నిర్మాణం ప్రారంభించింది. ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో నిర్మిస్తున్న సినిమా ఇష్క్. యంగ్ హీరో తేజ సజ్జా, ప్రియావారియర్ లీడ్ పెయిర్. ఎస్ఎస్ రాజు దర్శకుడు. 

ఈ సినిమా కోసం ఈ జనరేషన్ సంగీత సంచలనం సిద్దు శ్రీరామ్ పాడిన పాటను కొన్నేళ్ల క్రితం ఇష్క్ సినిమా పేరుతో పెద్ద హిట్ కొట్టిన హీరో నితిన్ విడుదల చేసారు. ఈ మెలోడియస్ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

ఆనందమానందమంద…అంటూ సాగిన ఈ పాట ఇమ్మీడియట్ గా జనాలకు పట్టేలా ట్యూన్ చేసారు. దానికి సిద్దూ మ్యాజికల్ వాయిస్ యాడెడ్ అడ్వాంటేజ్ అన్నది మామూలే. 

పారస్ జైన్, ఎన్వీప్రసాద్ నిర్మించే ఈ సినిమా చకచకా షూట్ జరుపుకుంటోంది. ఇటీవలే శశి సినిమా నుంచి సిద్దూ సాంగ్ వచ్చింది. మరో చిన్న సినిమానుంచి కూడా సిద్దు పాట బయటకు వచ్చింది.  దాని తరువాత ఈ పాట విడుదలయింది. ఇది కాక వరుడు కావలెను సినిమా నుంచి కూడా సిద్దు పాట రాబోతోంది. మొత్తానికి ఈ సీజన్ అంతా సిద్దూపాటల మయమైపోయింది.