ఎగ్జిట్‌పోల్స్.. బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త!

దేశంలో రేపు చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4 వ‌చ్చే ఫలితాల కంటే ముందుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రానున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్ల దృష్టి అంత ఎగ్జిట్ పోల్స్‌పై ప‌డింది. ఎందుకంటే…

దేశంలో రేపు చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4 వ‌చ్చే ఫలితాల కంటే ముందుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రానున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్ల దృష్టి అంత ఎగ్జిట్ పోల్స్‌పై ప‌డింది. ఎందుకంటే ఎన్నిక‌ల అనంత‌రం నడిచే బెట్టింగ్‌లు కంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత నడిచే బెట్టింగ్‌లు ఒక ఎత్తు. వాటిని చూసే బెట్టింగ్ వేసే వారు బాగా మోసపోయేది. అందుకే ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు త‌ర్వాత స్టాక్ మార్కెట్ లెక్క‌లు కూడా మారుతుంటాయి. 

మరీ ముఖ్యంగా దేశం మొత్తం జ‌రిగిన‌ ఎన్నిక‌లు ఒక ఎత్తు అయితే తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌లు ఒక ఎత్తు.. తెలంగాణ‌లో అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ సీటు అయినా గెలుస్తుందా?.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌కు ఎన్నెన్ని సీట్లు వ‌స్తాయి?.. అంటూ బెట్టింగ్‌లు కాస్తున్న‌ట్లు విన‌ప‌డుతోంది. ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఒక సీటు కూడా రాక‌పోతే ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను బీజేపీ అక్ర‌మించే అవ‌కాశం లేక‌పోలేదు.

ఇంకా ఏపీలో అయితే రాజ‌కీయాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. నువ్వా.. నేనా అన్న‌ట్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అదే రీతిలో ఎన్నిక‌ల అనంత‌రం కూడా ఫ‌లితాల‌పై అశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుస్తారా?.. గెలిస్తే మెజారిటీ ఎంత‌?.. లోకేష్ గెలిస్తే మెజారిటీ ఎంత‌?.. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ల్లో ఎవ‌రి మెజారిటీ ఎక్కువ? ఉంటుంది.. వైసీపీ గెలిచే స్ధానాలు?… టీడీపీ గెలిచే స్థానాలు? అంటూ విప‌రీతంగా బెట్టింగ్‌లు జ‌రిగిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి.

అలాగే ఒక పార్టీ అధినేత ఏమో గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు వ‌స్తాయి అంటూ ప్ర‌మాణ స్వీకారం డేట్, టైమ్‌ కూడా పిక్స్ చేసుకుంటే.. మ‌రో పార్టీ అధినేత ఈసారి ఊహించని విధంగా ఫ‌లితాలు రాబోతున్నాయి అన్నారు. దీంతో త‌మ‌త‌మ పార్టీ అభిమానులు నాయ‌కుల మాట‌ల‌తో విపరీతంగా బెట్టింగ్ వేశారు. దానితో పాటు రోజుకు ఒక పేరుతో సోష‌ల్ మీడియాలో స‌ర్వే వదులుతూ ఇరు పార్టీ అభిమానుల‌ను డైలమాలో నెట్టేశారు. దీంతో నాయ‌కుల మాట‌లను, ఆ స‌ర్వేల‌ను న‌మ్మ‌ని వ‌ర్గం మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను బెస్ చేసుకోని బెట్టింగ్‌లు కాయడానికి సిద్ధం అవుతోంది. 

కానీ, ప్ర‌స్తుతం ఎగ్జిట్ పోల్స్ ఎంత వ‌ర‌కు నిజం అవుతాయి అనేది చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. దేశ మీడియా మొద‌లుకొని.. లోక‌ల్ మీడియాతో స‌హా అన్ని రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఏదో పార్టీ చేతులో చిక్కుకున్నాయి. దీంతో వారు త‌మ అభిమాన పార్టీకి వ్య‌తిరేకంగా రిపోర్ట్ ఇస్తారా? అంటే చెప్పలేం. ఇటీవ‌లే కొన్ని ఎగ్జిట్ ఫ‌లితాలు ఫెయిల్ అయినా విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన మ‌ధ్య‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, చత్తీస్ గడ్, రాజ‌స్ధాన్ ఎన్నిక‌ల ఎగ్జిట్ ఫ‌లితాలే ఉదాహ‌ర‌ణ‌. 

ఎగ్జిట్ పోల్స్ త‌ర్వాత‌ బెట్టింగ్ గ్యాంగ్స్ ఇచ్చే ఆఫ‌ర్ నమ్మి పందేలు కాసి మోస‌పోయే వారే ఎక్కువ ఉంటున్నారు. గ‌తంలో కూడా ఓ మాజీ ఎంపీ త‌న ప్ర‌తిభ‌తో ఇలాగే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల బెట్టింగ్ రాయుళ్లను నిండా ముంచిన విష‌యం తెలిసిందే. దీంతో బెట్టింగ్స్ జోలికి వెళ్ల‌కుండా ఉండ‌ట‌మే బెట‌ర్‌.. లేదో కాదు అనుకుంటే మాత్రం ఈసారి భారీ మొత్తంలో డ‌బ్బులు, అస్తులు పోగొట్టుకునే వారి సంఖ్య‌ను చూడొచ్చు.