పూరి జగన్నాధ్ తీస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఊహించని విధంగా వివాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊతపదాన్ని, యథాతథంగా ఆయన గొంతులోనే వాడడం జరిగింది.
దీనిపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పాటపై, మేకర్స్ పై పోలీసులకు కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. కొన్ని రోజుల కిందట దీనిపై టీవీల్లో చర్చలు కూడా నడిచాయి.
ఓవైపు ఇంత నడుస్తుంటే, మరోవైపు ఈ పాట గురించి ప్రత్యేకంగా మాట్లాడేందుకు కెమెరా ముందుకొచ్చాడు పూరి జగన్నాధ్. వివాదం గురించి ఏమీ తెలియనట్టే మాట్లాడాడు. అసలు ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు.
ఇస్మార్ట్ శంకర్ లో “దిమాక్ ఖరాబ్” పాట ఎంత హిట్టయిందో, డబుల్ ఇస్మార్ట్ లో ‘మార్ ముంత ఛోడ్ చింత’ సాంగ్ అంతకంటే పెద్ద హిట్టయిందన్నాడు పూరి. నిజానికి ఈ సాంగ్ రిలీజైన తర్వాత దిమాక్ ఖరాబ్ సాంగ్ ను చాలామంది మరిచిపోయారని చెప్పుకొచ్చాడు.
సింగిల్ స్క్రీన్స్ లో ఈలలు వేస్తూ, గోల చేస్తూ ఎంజాయ్ చేసే పాటగా దీన్ని అభివర్ణించిన పూరి జగన్నాధ్.. త్వరలోనే థియేటర్లలో ఈ సాంగ్ ను అంతా ఎంజాయ్ చేస్తారంటూ ముగించాడు. కేసీఆర్ గొంతుతో పెట్టిన డైలాగ్ ను కొనసాగిస్తున్నారా లేక కట్ చేశారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
థియేటర్ ను పక్కనపెట్టిన జనం
జనం పాటలను స్కిప్ చేస్తారు ఓటిటిలో
Veedu drugs ammukuntaru prajalu ku neethulu cheptharu
what will happen if there is KCR voice in the song. what is wrong in that and why ppl are making issues on that any particular reason??