నిర్మల: ఇంత గందరగోళంగా మాట్లాడాలా మేడం!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బాగానే ఉంది. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఏకంగా 15వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకా బాగానే ఉంది. అలాగే.. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బాగానే ఉంది. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఏకంగా 15వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకా బాగానే ఉంది. అలాగే.. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి అన్నిరకాల తోడ్పాటు అందిస్తామని చెప్పారు. మహబాగా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి.

కానీ.. ఎక్కడో ఏదో క్లారిటీ మిస్ అవుతోంది. ఈ మిస్ అవుతున్న దానిని భర్తా చేయడానికి ఒక విలేకరి ఆమెను సూటిగా ప్రశ్న అడిగారు. కానీ ఆమె జవాబు మాత్రం చాలా డొంకతిరుగుడుగా.. అసలు అడిగిన వాడు .. తాను ఏం అడిగానో మర్చిపోయేలాగా ఇచ్చారు. గందరగోళంలోంచి, మరింత గందరగోళంలోకి నెట్టేశారు.

బడ్జెట్ తర్వాత నిర్మలమ్మ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఒక తెలుగుపత్రిక విలేకరి చాలా సూటిగా రెండు ప్రశ్నలు అడిగారు. అవి ఇవి- అమరావతి రాజధానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తాం అన్నారు కదా.? అది లోనా? గ్రాంటా? అనేది ఒక ప్రశ్న. పోలవరం ప్రాజెక్టుకు అన్ని రకాల తోడ్పాటు అంటే ఏమిటి? అనేది రెండో ప్రశ్న.

కానీ ఆర్థికమంత్రి నిర్మలమ్మ ముందుగా పోలవరం జవాబు ప్రారంభించారు. తెలుగులోనే జవాబు చెప్పడానికి పూనుకుని 5 నిమిషాలు అనర్గళంగా చెప్పారు. ఇంతా కలిపి.. అది జాతీయ ప్రాజెక్టు అని.. కానీ స్టేట్ గవర్నమెంటు ఇంప్లిమెంటు చేస్తోందని రకరకాలుగా చెప్పారు. గ్రాంటు లోను అనే ప్రస్తావనే ఉండదని.. అది పూర్తిగా తమ (జాతీయ) ప్రాజెక్టు అని అన్నారు. నిజానికి విలేకరి ఆ తేడా అడిగినది అమరావతికి ఇచ్చే 15 వేల కోట్ల గురించి.. కానీ.. ఆమె పూర్తిగా పోలవరానికి ముడిపెట్టి చెప్పారు.

మళ్లీ క్లారిటీ కోరినప్పుడు కూడా ఇంకా గందరగోళంగా చెప్పారు. అమరావతి రాజధాని కోసం సాయం అందించాలని.. పదేళ్లు రాజధాని లేకుండా రాష్ట్రం ఉండిపోయిందని. వరల్డ్ బ్యాంకు అసిస్టెన్స్ తీసుకుంటాం అని, దానిని తిరిగి చెల్లించాలని ఇలా రకరకాలుగా అనేక మాటలు చెప్పారు తప్ప.. ఇంతకీ కేంద్రం ఇచ్చే సొమ్ము గ్రాంటా? లోనా? అనే సంగతి మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు.

సదరు విలేకరి ఆమె అనుమతి తీసుకుని మరీ స్పష్టత కోసం తెలుగులోనే ప్రశ్న అడిగారు. నిర్మలమ్మ చాలా జాగ్రత్తగా తెలుగులోనే సమాధానం చెప్పారు. కానీ ఆ సమాధానాన్ని ఎన్నిసార్లు విన్నా సరే.. ఆమె చెప్పదలచుకున్నది ఏమిటో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

12 Replies to “నిర్మల: ఇంత గందరగోళంగా మాట్లాడాలా మేడం!”

  1. She was clear that AP will get funds via loan route and that center will make it happen. When development is happening why are you crying ra GA jaffa.

  2. ఇందులో అర్థం కాకపోవడం ఏముంది? కేంద్రం వరల్డ్ బ్యాంకు ముందు చిప్ప పెడుతుంది..అందులో పడే చిల్లర ఏ పీ కి విధుల్చతుంది.అంతే ఇది పాత కథే.కాకపోతే ఇప్పుడు పాత సంకీర్ణ పాలన పునరావృతం అయ్యింది.అది అర్థం అయితే మోడీ గారి 3.0 పాలన ఎలా ఉండబోతుందో గ్రహించవచ్చు.

  3. ఇలాంటి కరోడా కాబట్టే 3 పర్యాయాలు ఆర్ధిక మంత్రిగా అవకాశం కల్పించారు. ఇలాంటి వారు ఇల్లు వదలి దేశం మీద పడటంతో ఆ ఇల్లయినా ప్రశాంతంగా ఉంటుంది.

Comments are closed.