అన్నా క్యాంటీన్లు తెరుస్తూ… క‌డుపు కొడ‌తారా?

వీపుపై ఒక దెబ్బ వేసినా ఇబ్బంది లేద‌ని, క‌డుపు కొట్టొద్ద‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఇప్పుడు క‌డుపు కొట్టే ప‌ని టీడీపీ చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌వైపు ఆగ‌స్టు 15న స్వాతంత్ర్యం దినాన్ని పుర‌స్క‌రించుకుని…

వీపుపై ఒక దెబ్బ వేసినా ఇబ్బంది లేద‌ని, క‌డుపు కొట్టొద్ద‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఇప్పుడు క‌డుపు కొట్టే ప‌ని టీడీపీ చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌వైపు ఆగ‌స్టు 15న స్వాతంత్ర్యం దినాన్ని పుర‌స్క‌రించుకుని అన్నా క్యాంటీన్లు తెర‌వాల‌ని నిర్ణ‌యించి, మ‌రోవైపు చిన్న ఉద్యోగుల‌పై వైసీపీ ముద్ర వేసి తొల‌గిస్తుండ‌డం తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీస్తోంది. ఈ ప‌రిణామాలు రాజ‌కీయంగా టీడీపీకి త‌ప్ప‌కుండా న‌ష్టం తెస్తాయి.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు… రాష్ట్ర వ్యాప్తంగా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వ‌ర్క‌ర్లు, ఐకేపీ, వీఏవోలు, చౌక‌దుకాణం డీల‌ర్లు త‌దిత‌ర చిన్న‌చిన్న ఉద్యోగుల‌పై టీడీపీ నేత‌లు ప‌డ్డారు. ఎప్ప‌టి నుంచో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ల‌ను రాజీనామాలు చేసి వెళ్లాల‌ని బ‌ల‌వంతపెట్ట‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. టీడీపీ నేత‌ల వేధింపులు తాళ‌లేక కొన్ని చోట్ల అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, ఆయాలు, అలాగే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వ‌ర్క‌ర్లు త‌దిత‌ర ఉద్యోగులు ఆత్మాహ‌త్యాయ‌త్నాలకు పాల్ప‌డ్డారు. కొన్ని చోట్ల ప్రాణాలు కూడా కోల్పోయారు.

అధికార పార్టీ నేత‌ల వేధింపులను నిర‌సిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు రోడ్డెక్కారు. క‌లెక్ట‌రేట్లతో పాటు ఇత‌ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఎదుట ధ‌ర్నాలు చేప‌ట్టడం ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట‌త. వీళ్లంతా చిన్న ఉద్యోగులే అయిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టి నుంచే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడ్డం మొద‌లు పెడితే, రాజ‌కీయంగా చాలా న‌ష్ట‌మ‌ని కూట‌మి నేత‌లు ఎందుకు గ్ర‌హించ‌డం లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

అధికార పార్టీ నేత‌లు త‌మ వాళ్ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు, మ‌రొక‌టి ఉపాధిని పోగొట్ట‌డం ఎంత వ‌ర‌కు సరైందో ఆలోచించాలి. చేత‌నైతే కొత్త ఉపాధి మార్గాల్ని అన్వేషించాలి. అధికారాన్ని ఉప‌యోగించి బ‌తుకుదెరువు చూపించాలి. ఆ ప‌ని చేయ‌కుండా చిరు ఉద్యోగుల‌ను వేధిస్తూ, వారి కుటుంబాల‌ను వీధిన ప‌డేయ‌డం కూట‌మికే న‌ష్టం. ఇప్ప‌టికే చాలా చోట్ల కార్మికుల ఉద్యోగాల‌ను ఊడ‌గొట్టారు. ఇలాంటి వాళ్లందరినీ అనివార్యంగా త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీ వైపు పంపిన ఘ‌న‌త కూట‌మికే ద‌క్కుతుంది. కావున ఇప్ప‌టికైనా అధికార పార్టీ నేత‌లు ఆలోచించి, చిరు ఉద్యోగుల క‌డుపు కొట్ట‌డం మానుకోవాలి. తొల‌గించిన ఉద్యోగుల్ని తిరిగి నియ‌మిస్తే మంచిది.

20 Replies to “అన్నా క్యాంటీన్లు తెరుస్తూ… క‌డుపు కొడ‌తారా?”

  1. ఎక్కువ ఫీల్ అయిపోమాకు… అప్పుడు అర్హత మీద కాకుండా సిపారుసు ల తో ఎవరు ఉద్యోగం తెచ్చున్నారో వాళ్ళ దగ్గర కి పోయి వీళ్ళు లాక్కుంటున్నారు… ఒక వేళ మళ్ళీ మన అన్న ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళు మళ్ళీ లాక్కుంటారు.. ఇదొక సైకిల్ అంతే

  2. మొన్న మా ఊరు వెళ్ళా ..అందరి మొహాల్లో తెలియని ప్రశాంతత..
    కరణం అడిగితే మంచి ప్రభుత్వం వచ్చింది అని చెప్పారు GA
  3. ఇలా ఉద్యోగాలు పోయిన్ వారు అందరికీ సాక్షీ,భారతి సిమెంట్ కంపెనీ ల్లో నెలకి లక్ష రూపాయలు జీతం తో ఉద్యోగాలు ఇచ్చి, కూటమి ప్రభుత్వం కి సవాల్ విసరాలి.

    మరి ఆ పని చేస్తాడా, ప్యాలస్ పులకేశి.

  4. Gatha 5 years lo okka vudhyogi ayina dharna chesaraa…? Antha manchidhi ma Jagananna prabhuthvam.

    Okka vudhyogi ayina dharna chesinattu nirupisthe, Jagan rajakeeya sanyasam thisukuntadu.

  5. ఎంతొ మంది ఆత్మహత్య చెసుకున్నరా?

    .

    11 వచ్చాక ఫస్ట్రెషన్ చాలా ఎక్కువ అయినటు ఉంది, మరీ ఇలా రాస్తున్నడు.

  6. ఒహొ! ఇప్పుడు నీ ఎడుపు అర్ధం అయ్యింది.

    అప్పట్లొ జగన్ ఇంట్లొ పని చెసె వారికి, నిబందనలకి వ్యతిరెకంగా ఎవొ ఉద్యొగాలలొ పొస్ట్లింగ్ లు ఇచ్చరు అని విన్నా!

    వారిని తీసెస్తుంటె నువ్వు ఇస్తున్న కలరింగ్ ఇదా?

  7. అప్పట్లో ప్యాలస్ పులకేశి ఇంట్లో వ్యక్తిగత పని మనుషులకి ఫైర్ డిపార్టుమెంటు లో వేరే ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసారు అన్నారు, కేవలం నోటి మాట తో, పరీక్షలు లేకుండా.

    వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేసార ?

    లేక వాళ్ళ జీతం డబ్బులు కూడా మేడం గారు నొక్కేస్తున్నారా ?

  8. మేమంతే ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు కూటమి పార్టీల నాయకులు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు శాశ్వతం కాదు. ఇదే తీరుగా 2019-24 మధ్యలో ఉంటే వీరంతా ఎక్కడ ఉండేవారు అనేది కూడా ఆలోచించాలి. ఢిల్లీలో మొదలైంది షేక్ అదే విధంగా ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా షేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 లో జరిగిన ఎన్నికల ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అంతర్మధనంలో పడ్డారు. త్వరలోనే కాంగ్రెస్ కూటమి పై చేయి సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీ వేదికగా జగన్ ప్రభావం రెండు కూటములకు కీలకం కానుంది.

Comments are closed.