మరోసారి చిక్కుల్లో సుమ

వివాదాలకు దూరంగా ఉండే సెలబ్రిటీ సుమ. టీవీ సెలబ్రిటీల నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ ఈమె చాలా క్లోజ్. అయితే ఆమధ్య ఓ సినిమా ఫంక్షన్ లో మీడియాపై ఆమె చేసిన అభ్యంతరకర…

వివాదాలకు దూరంగా ఉండే సెలబ్రిటీ సుమ. టీవీ సెలబ్రిటీల నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ ఈమె చాలా క్లోజ్. అయితే ఆమధ్య ఓ సినిమా ఫంక్షన్ లో మీడియాపై ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వెంటనే ఆమె సారీ చెప్పారు.

ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు సుమ. రాజమండ్రికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారం చేశారు సుమ. దానికి సంబంధించి యాడ్స్ లో భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఆమె పాల్గొన్నారు.

రాకీ ఎవెన్యూస్ పేరిట వెలసిన ఆ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసింది. ఏకంగా 88 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో ఇందులో డబ్బులుపెట్టి మోసపోయినవాళ్లంతా రోడెక్కారు. యాడ్స్ లో సుమ మొహం చూసి, ఆమెను నమ్మి డబ్బులు పెట్టామని కొందరు వాపోయారు.

విషయం సుమ వరకు వెళ్లింది. వెంటనే ఆమె స్పందించింది. రాకీ ఎవెన్యూస్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మాట నిజమేనని అంగీకరించిన సుమ.. ఆ కంపెనీకి తాను 2016 నుంచి రెండేళ్ల వరకు మాత్రమే ప్రచారం చేశానని, ఆ తర్వాత ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.

ఇప్పటికీ తన యాడ్స్ కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయని, అలాంటి వాటిపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని సుమ స్పష్టం చేశారు.

7 Replies to “మరోసారి చిక్కుల్లో సుమ”

Comments are closed.