మహేష్.. అన్న.. సార్.. గారు..!

అతడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అంటూ ధర్మవరపు తనదైన శైలిలో మంచి డైలాగ్ చెబుతారు. హీరో తేజ సజ్జ ఈరోజు వేసిన ట్వీట్ చూస్తే…

అతడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అంటూ ధర్మవరపు తనదైన శైలిలో మంచి డైలాగ్ చెబుతారు. హీరో తేజ సజ్జ ఈరోజు వేసిన ట్వీట్ చూస్తే ఎవరికైనా ఇదే డైలాగ్ గుర్తొస్తుంది.

మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తేజ సజ్జ ఉద్దేశం. మరి ఎలా చెప్పాలి. అన్నా అని సంభోదిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో.. పోనీ సర్ అందామంటే మరీ అతిగా ఉంటుందేమో.. గారు అందామంటే మరీ ఓవర్ అవుతుందేమో.

ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి ఫైనల్ గా ఓ ట్వీటేశాడు. మొదటి లైన్ లో మహేష్ అన్నా అన్నాడు. రెండో లైన్ లో మహేష్ సార్ అన్నాడు. మూడో లైన్ లో మహేష్ గారు అన్నాడు. ఇంక ఎవ్వరూ తనపైకి రారు అని గట్టిగా ఫిక్స్ అయి మరీ ఇలా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాడు.

బాలనటుడిగా ఉన్నప్పుడు మహేష్ తో ఓ సినిమా చేశాడు తేజ సజ్జ. ఆ సినిమాలో స్టిల్ షేర్ చేసి మరీ ఇలా “గారు..సారూ..అన్నా” అంటూ వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. బహుశా దీన్నే సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అంటారేమో.

5 Replies to “మహేష్.. అన్న.. సార్.. గారు..!”

Comments are closed.