నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రాజకీయం నిత్యం గరంగరంగానే వుంటోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య నిత్యం డైలాగ్ వార్ జరుగుతోంది. కాకాణి అవినీతిపై విచారణ జరపాలంటూ కలెక్టర్‌కు సోమిరెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాకాణి మీడియా ముందుకొచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమిరెడ్డికి పిచ్చి పట్టిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్‌కు విలువ లేకుండా చేశారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సామాజిక న్యాయం పేరుతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రం, నెల్లూరు జిల్లా పరిస్థితులు ఒక రకమైతే, సర్వేపల్లిలో మరో రకమైన వాతావరణం ఉన్నట్టు ఆయన చెప్పారు.
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి టైమ్ బాగుండి గెలిచారని ఆయన అన్నారు. 20 ఏళ్ల ఎమ్మెల్యేగా గెలిచానని, జీవితంలో గుర్తుండిపోయేలా అభివృద్ధి చేద్దామన్న సంగతిని సోమిరెడ్డి విస్మరించినట్టు కాకాణి ఆరోపించారు. నిద్రలేచిన మొదలు సోమిరెడ్డి, ఆయన కుమారుడు చెరో సంచి వేసుకుని, సాయంత్రానికి నిండితే ఇంటికి చేరడం అలవాటైందని దెప్పి పొడిచారు.
జగన్ అధికారం కోల్పోయినప్పటి నుంచి సోమిరెడ్డి కాలువల మీద తిరగడం అలవాటు చేసుకున్నాడన్నారు. ఇదేమి ఆయనకు కొత్త కాదన్నారు. ఏ కాలువ మీదైతే సోమిరెడ్డి తిరుగుతాడో, సంబంధిత కాంట్రాక్టర్ ఆయన్ను కలవాల్సి వుంటుందన్నారు. ఒకవేళ కలవకపోతే రెండో సారి అప్పటికీ కలవకపోతే మూడో మళ్లీ వెళ్తాడన్నారు. షట్టర్ కాంట్రాక్టర్లు ఇంకా సోమిరెడ్డిని కలిసినట్టు లేదన్నారు.
నిన్న కలెక్టరేట్‌కు వెళ్లి సర్వేపల్లిలో ఘోరాలు, నేరాలు జరిగినట్టు ఫిర్యాదు చేసి వచ్చాడన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డికి కాకాణి సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం వుంటే… ఎన్నికలకు ముందు ఏ విషయాల మీదైతే వచ్చావో, వాటిపై విచారించే సత్తా నీకు ఉందా? అని కాకాణి సవాల్ విసిరారు. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అనే సామెత వుందంటూ… సోమిరెడ్డిని కరవని దానితో పోల్చడం గమనార్హం.
ఇంతకాలం సోమిరెడ్డికి వినికిడి లోపమే ఉందని అనుకున్నానని, ఈ మధ్య పిచ్చి కూడా పట్టినట్టు వుందని ఆయన వెటకరించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన సోమిరెడ్డిలో కనిపించడం లేదన్నారు. ఏవైతే తనపై ఆరోపణలు చేశారో, దమ్ముంటే విచారించి నిగ్గు తేల్చాలని కాకాణి సవాల్ విసిరారు.
Collectorate లో కి దొంగలను పంపి complaint files ettukupothaadu.. అప్పుడు em చేస్తా v సోమిరెడ్డి??
ఈసారి తగలపెడతాము మీరు ఏమి చెయ్యలేరు
స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయము అని 100 సార్లు చెప్పివుంటారు . ఇంకా, మెడలు వంచి తెస్తాము అంటే ? మన మెడలు వంచకుండా ఉంటే చాలు. pata message
అవునవును, అంబేద్కర్ దూర విద్య పేరు మార్చి మీరు చాలా విలువ పెంచేశారు
Vc available 9380537747
Call boy works 8341510897
కాకాని గాడికి పెద్ద రాడ్ ఎర్రగా కాల్సి రెడీ గా వుంది, దూర్చడానికి.