బన్నీ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

ఈరోజు ఆగస్ట్ 15.. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అటు హిందీలో కూడా 3 సినిమాలు గ్రాండ్ గా రిలీజయ్యాయి. వీటితో బన్నీ ఫ్యాన్స్ కు ఎలాంటి సంబంధం…

ఈరోజు ఆగస్ట్ 15.. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అటు హిందీలో కూడా 3 సినిమాలు గ్రాండ్ గా రిలీజయ్యాయి. వీటితో బన్నీ ఫ్యాన్స్ కు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లు బాధపడుతున్నది ఈ సినిమాల్ని చూసి కాదు, బన్నీ సినిమా బరిలో లేనందుకు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు పుష్ప-2 సినిమా థియేటర్లలోకి వచ్చి ఉండేది. అల్లు అర్జున్ ఆర్మీ పండగ చేసుకొని ఉండేది. కానీ బన్నీ సినిమాను వాయిదా వేశారు. బన్నీ ఫ్యాన్స్ ఆవేదనలో మరో కోణం కూడా ఉంది.

ఎలాగూ ఈరోజు సినిమా రిలీజ్ అవ్వలేదు, కనీసం పుష్ప-2 నుంచి పంద్రాగస్టు కానుకగా ఒక పోస్టర్ అయినా రిలీజైతే బాగుండేదనేది అభిమానుల ఆవేదన. గతంలో ప్రభాస్ తన ఫ్యాన్స్ విషయంలో ఇలానే చేశాడు. సలార్ వాయిదాపడినప్పుడు, లెక్కప్రకారం చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయలేకపోయినా, ఓ పోస్టర్ రిలీజ్ చేసి, ఉన్నంతలో అభిమానుల్లో ఆనందం నింపాడు. ఈరోజు బన్నీ అలాంటిదేదో చేసుంటే బాగుండేది.

ఇలా చేయడం వల్ల యూనిట్ నుంచి చిన్నపాటి క్లారిటీ ఇచ్చినట్టయ్యేది. ఎందుకంటే, పుష్ప-2 సినిమా డిసెంబర్ 6కి కూడా వచ్చేది అనుమానమే అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో విడుదల తేదీతో కొత్త పోస్టర్ వదిలితే అందరూ హ్యాపీ. కానీ అలాంటిదేం జరగలేదు.

రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది పుష్ప-2 సినిమా. ప్రస్తుతం బన్నీ ఈ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో షూట్ నడుస్తోంది. లెక్కప్రకారం, వారం రోజుల్లో ఈ షెడ్యూల్ ముగియాల్సి ఉన్నప్పటికీ, బన్నీ మాత్రం వరుసగా కాల్షీట్లు కేటాయించాడు.

5 Replies to “బన్నీ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం”

Comments are closed.