చంద్రబాబు ఈ రిజల్ట్ చూపించకపోతే కష్టం

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నెలలవుతోంది.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నెలలవుతోంది. ఇప్పటి వరకు అమలుపరిచిన ఏకైక సంక్షేమపథకం – పెన్షన్లు. అంతకు మించి మిగిలినవాటి గురించి మాట్లాడడం లేదు. ప్రజలు అడిగినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారా? అసలు అడక్కుండా వాగ్దానాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉందా అనేది తెలీదు.

తరచూ కలెక్టర్లతోటి, ఆఫీసర్స్ తోటి, ఇతర వర్గాలతోటి మీటింగులు పెడుతూ సుపరిపాలన దిశగా తీసుకెళ్తున్నట్టు కనిపిస్తున్నారు బాబుగారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ కాలక్షేపం చేసేస్తారనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు.

ఎందుకంటే జనం చేతికి డబ్బు అందాలి. కరోనా సమయంలో ఏ పనులూ లేకపోయినా కూడా పేదవాళ్లు ప్రశాంతంగా ఉండడానికి కారణం నాటి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా అందిన డబ్బే. కరోనా లాక్ డౌన్ లాంటి పరిస్థితి కాకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో కరువు వాతావరణం ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణాతో కలిపి దేశమంతా వానలు కురుస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వానల్లేవు. రాయలసీమలో అయితే నీటి కరువు దారుణంగా ఉంది. పంటలు పండే పరిస్థితి లేదు. రైతులు అల్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే ఆగష్ట్ 21 న తిరుమలలో ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన సారాంశం ఇది:

“తిరుమలలో భక్తులు మరియు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలి. తిరుమలలో ప్రస్తుతం నీరు 130 రోజులకు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి, తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది” అని టీటీడీ పేర్కొంది.

చంద్రబాబు పాలనలో వర్షాలు పడవని ఒక సెంటిమెంట్ ఉంది. అలాంటివి నమ్మడం సైంటిఫిక్ కాకపోయినా ఇప్పటివరకు పరిస్థితి చూస్తే అలానే ఉంది. ఇలాంటి సమయాల్లో ముఖ్యమంత్రిని వర్షాలు కురిపించమని కోరలేం కానీ, ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయలపై దృష్టిపెట్టాలని మాత్రం కోరాలి.

ఈ విషయం పక్కన పెడితే, చంద్రబాబు ఒక విషయంలో మాత్రం కచ్చితంగా రిజల్ట్ చూపించి తీరాలి. తన రాజకీయ మనుగడకి, తనను వెన్నంటి ఉన్న ఎన్నారైల సపోర్ట్ కొనసాగడానికి, తన పార్టీ నాయకులు, కులసంఘాల వాళ్లు ఎల్లప్పుడూ తన వెంట ఉండడానికి చేయాల్సిన ముఖ్యమైన పని అది. అదే అమరావతి నిర్మాణం. అక్కడి భూములకు బూం తీసుకురావడం.

ఆంధ్రలో తెదేపా సంకీర్ణ ప్రభుత్వం వస్తే హైదరాబాదు రియల్ ఎస్టేట్ కుదేలవుతుందని, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లంతా అమరావతిలో పెడతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మీద అంతటి నమ్మకం మరి.

అనుకున్నట్టుగానే తెదేపా నెగ్గగానే ఒక్క రవ్వ అమరావతి రియల్ ఎస్టేట్ కి ఊపొచ్చింది. మళ్లీ వెంటనే చల్లబడిపోయింది. అమరావతి భూముల ధరలకి రెక్కలొస్తే చుట్టుపక్కల రేడియస్ లో చాలా ప్రాంతాల రేట్లు పెరుగుతాయి. అమరావతికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో రెండు నెలల క్రితం పాతిక లక్షలు పలికే భూమిని ఇప్పుడు 15 లక్షలకి కొనేవాళ్లు లేరు. ఇదే పరిస్థితి అమరావతిలో కూడా ఉంది.

జగన్ పాలనలో మూడు రాజధానుల పేరిట అన్ని చోట్లా ఎంతో కొంత రియల్ బూం వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక అమరావతి ఒక్కటే రాజధాని అని తేల్చి చెప్పడంతో విశాఖ, కర్నూల్ రియల్ ఎస్టేట్ ఢమాల్ న పడింది. అలాగని అమరావతిలో బాగుందా అంటే అదీ లేదు.

ఈ పరిస్థితికి కారణం “మళ్లీ జగన్ వస్తే తమ పెట్టుబడులు గుల్లౌతాయేమోనని ఎవరూ ముందుకు రావట్లేదు” అనే అభిప్రాయాన్ని కొన్నాళ్లు నడిపారు. అలా అని ఆ అభిప్రాయాన్ని చెరపలేకపోతే మాత్రం చంద్రబాబు గెలిచి కూడా ఉపయోగం లేనట్టే.

అమరావతిలో భూములున్న చాలామంది మంచి రేటొస్తే అమ్మేసుకుని హైదరాబాదులో రేవంత్ రెడ్డి ప్రకటించిన ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని వినికిడి. అంటే అమరావతి గ్రోత్ కంటే హైదరావాద్ గ్రోత్ ని నమ్ముకోవడమే నయమని వాళ్లు అనుకుంటున్నట్టేగా? ఇదే నిజమైతే సత్వరం అమరావతికి అంటుకున్న ఈ నెగటివ్ ఇమేజ్ ని మార్చే బాధ్యత చంద్రబాబుదే.

హైదరాబాద్ పై మోజుకు కారణం ఎంత పెరిగినా ఇంకా పెరుగుతుందన్న నమ్మకం, అక్కడ వెలుస్తున్న బహుళ భవనాలు, ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు. మరి అమరావతికీ ఆ క్రేజ్ ఉందా? క్రేజ్ లేకుండా రియల్ ఎస్టేట్ బూం ఎలా వస్తుంది? క్రేజ్ తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? ఇన్వెస్టర్స్ ని ఎలా నమ్మించాలి? ఎలా ఆకట్టుకోవాలి? ఏమో…ముఖ్యమంత్రికే తెలియాలి.

అమరావతి రియల్ బూం తీసుకురావడం వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టిన పెత్తందారుల, ధనికుల, ఎన్నారైల కళ్లు చల్లబడతాయి. వాగ్దానం చేసిన స్కీములు ఇవ్వడం వల్ల పేదల కడుపులు నిండుతాయి.

ఈ రెండూ పరిపాలనలో స్వాగతించదగినవైన రాజకీయ అవసరాలు.

గత ప్రభుత్వం పేదల కడుపు నింపినా… పెత్తందారుల, స్వకులస్థుల కళ్లు చల్లబరిచే పనులేవీ చేయలేదు. “మా జగన్ వస్తే మేము బాగుపడతాం, మరో మెట్టు పైకి ఎక్కుతాం” అని అనుకున్న వైకాపా అభిమాన శ్రేణుల్లోని ఎన్నారైలు, పెత్తందార్లు బాగుపడలేదు. అందుకే వాళ్లు నెమ్మదిగా మొహం చాటేశారు. ఇప్పుడు చంద్రబాబు ఆ పరిస్థితి ఎదుర్కోకూడదంటే ప్రధానంగా అమరావతి సంగతి చూడాలి.

ప్రజలు ఎప్పుడూ ఒకేలా ఉండరు. నివురుగప్పిన నిప్పులా ఉంటారు. ఎక్కువ జాప్యం చేస్తే అసంతృప్తి జ్వాలలు చూపిస్తారు. అలాగే వెన్నంటి ఉన్నట్టు ఉండే పెత్తందార్లు ఎప్పటికప్పుడు తమ ఆశలు నెరవేరుతాయా అనేది పరీక్షిస్తూ ఉంటారు. ఆశ సన్నగిల్లితే మొహం చాటేస్తారు.

ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుని చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. “నా అనుభవానికి తెలుసు ఏం చెయ్యాలో. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నా, అనుకున్నా చేసేదేం లేదు.

శ్రీనివాసమూర్తి

65 Replies to “చంద్రబాబు ఈ రిజల్ట్ చూపించకపోతే కష్టం”

  1. “జగన్ ప్రభుత్వం” అని నొక్కి పలకమాక, వాడేదో ప్రభువు అయినట్టు, వాడి జేబు లో సొమ్ము ధానం చేసినట్టు. ప్రపంచం మొత్తం కరోనా అపుడు ప్రజలకు డబ్బు పంచింది. ఇక పోతే ఎంత సేపు అమరావతి రియాల్టీ అని ఏడవకు. రాష్ట్రం కు రాజధాని లేదు, ఏం అభివృద్ధి చేస్తే తెలంగాణకు పోటీగా మన రాష్ట్రం కూడా రాజధాని గొప్ప తనం చెప్పుకోగలమో అని మటుకు ఏడువు. జగన్, విసారే వెళ్లి కెసిఆర్ కాళ్లకు మొక్కి ఆంధ్ర పరువు తీయటం కాదు, జీవితం అంటే.

  2. No rains and no free sand. Video of lorry driver who was 9th in line at night woke up in the morning finding himself to be 66th in line is going viral. Watch the woes of getting free sand even after paying money when there are no rains.

  3. 23 తెచ్చుకున్న నక్క, తోడేలుని, కుక్క ని కలుపుకుని కోతుల సాయం తో కుట్ర చేసి సింహానికి 11 వచ్చేలా చేసింది. ఇప్పుడు ఎలుగుబంటి సాయం తో కుట్ర బట్టబయలు అవుతుండటం తో సింహం ఏమి చెయ్యాలి? సింహం ఏమి చేస్తుందో అనే భయం తో నక్క, తోడేలు ఏమి చెయ్యాలి? దీని అంతట లో కుక్క పాత్ర ఏమిటి? అన్నింటికీ సమాధానం తొందర లో తెలుస్తుంది…

  4. 23-తెచ్చుకున్న-నక్క,-తోడేలుని,-కుక్కని-కలుపుకుని-కోతుల-సాయంతో-కుట్ర-చేసి-సింహానికి-11-వచ్చేలా-చేసింది. ఇప్పుడు-ఎలుగుబంటి-సాయంతో-కుట్ర-బట్టబయలు-అవుతుండటంతో-సింహం-ఏమి-చెయ్యాలి? సింహం-ఏమి-చేస్తుందో-అనే-భయంతో-నక్క,-తోడేలు-ఏమి-చెయ్యాలి? దీని-అంతటలో-కుక్క-పాత్ర-ఏమిటి? అన్నింటికీ-సమాధానం-తొందరలో-తెలుస్తుంది…

    1. అన్ని కలిసి విషసర్పం అనే జగన్ రెడ్డి కి 11 వచ్చేట్లు చేసాయి భలే భలే

    2. Please ad gajji before kukka which is best suited to jalaga vedhava. Vaado gajjikukka vaaditho evaroo potthu pettukoru deenki grama simham single simham antoo build up ఇస్తారు YCP dogs

  5. Ika free ivvaru raa. Em peekkuntaro peekkondi. kootami ante development. It will show development. So if you want development then talk. Otherwise anni moosuko.

      1. Development means mortgage of govt buildings

        Development means debts/ loans by showing future income on liquor for 25 year’s

        Development e-transfer of money’ without source of income

      2. Atleast parties shown interest to on alliance with TDP

        Jalaga vedhava palana raani daddamma chavata vedhava sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu gajjikukka

        Vaaditho evaroo potthu pettukoru deenki grama simham single simham antoo build up ఇస్తారు YCP dogs

    1. Development means swimming pool secretariats and VFX presentations. Development means levying tax on roads and waste. Development means selling public assets to private business men. Development means re-opening existing industrial units for sake of publicity.

      1. అబ్బా అబ్బా .. ఏమి గ్యానం ..

        .. లీకేజీ ఆయె సెక్రెటరియేట్ నుంచి మన అన్న ఫైవ్ ఇయర్స్ పాలించింది మర్చిపోయావా ?

        VFX ప్రెసెంటేషన్స్ న .. మరి మన అన్న ఎందుకు స్వామి పెర్మనెంట్ సెక్రెటరియేట్ బిల్డింగ్ కట్ట లేక పోయాడు ? మరి మన అన్న ప్రభుత్వ బిల్డింగ్స్ తక్కటు పెట్టాడు కనపడ లేదా ..

  6. మా సీమ జిల్లాల్లో కరువు విలయ తాండవం ఆడుతోంది.. ఎవడైనా ఆదుకోవాలి.. ఇప్పట్లో తుంగభద్ర నీళ్ళు వచ్చేలా లేవు.. కర్ణుడి పతనానికి సవాలక్ష కారణాలు..

      1. వలిగొండ టన్నెల్ వాటర్ తెలంగాణ గోల చేసి ఆపించారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు ప్రధాన నదులు పరవళ్ళు తొక్కుతున్నా ఆ నీటిని వినియోగించుకోలేని దౌర్భాగ్యం మా సీమది.. ఎంత మంది వచ్చినా ఏం లాభం

  7. కరువు కి pant షర్ట్ వేస్తే అది జెగ్గుల గాడే. .

    వాన దేవుడు జెగ్గులు పార్టీ లో సభ్యత్వం తీసుకున్నాడా ఏంటి??

    ఏంట్రా.. సీమలో గత 5 ఏళ్ళల్లో విపరీతంగా వర్షాలు వచ్చి పంటలు విరగ పండి రైతులు కోటీశ్వరులు అయ్యారా??

    మరి ఇయర్ wise.. వర్షాలు రాక జరిగిన పంట నష్టం స్టాటిస్టిక్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన డేటా కూడా చెప్పు సావు..

    అప్పుడు నమ్ముతాం

  8. అధికారం ఉంటే సిమెంట్ దాని బొ క్క.. లేకపోతే అయ్యసొక్క..

    ఎం బ్రతుకురా మీవి.. గ జ దొం గ ని కంటే బ్రతుకు గబ్బె. కాస్తో కూస్తో వున్నా పేరును కూడా సెడ దెంగావ్ కదరా అంటూ…రాజసం ఆత్మ గోషా

Comments are closed.