బూతులు మాట్లాడితే త్రివిక్ర‌మ్, పూరీ సినిమాల్లో ఛాన్స్!

స‌మాజంలో వికృత పోక‌డ‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటిని ఖండించేలా, వాటిలోని త‌ప్పుల‌ను ఎత్తి చూపేలా వెనుక‌టికి సినిమాలు వ‌చ్చాయి.

అయితే రీరిలీజ్ లు, లేక‌పోతే ఎవ‌రో ప్ర‌ముఖుడి సెకండ్ సెట‌ప్ గురించి, ఇదీ కాక‌పోతే ఇంకో జాత‌క‌ర‌త్న గురించి, కాదంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ అల్లు అర్జున్ గురించి.. ఇవ‌న్నీ కాక‌పోతే అల‌వోక‌గా బూతులు మాట్లాడగ‌ల వారి మేధ‌స్సు స్థాయికి ఫ్యాన్స్ అయిపోయి.. వాళ్లూ కాక‌పోతే మాన‌సిక స్థితి స‌రిగా లేక రోడ్ల‌పై తిరుగుతూ అర్థ‌ర‌హితంగా మాట్లాడుతూ, త‌మ భ్ర‌మ‌ల లోకంలో విహ‌రిస్తున్న వాళ్లు చెప్పే మాట‌లు, ఇవీ కాక‌పోతే.. మాడా వేషాలు.. ఇవీ తెలుగు నెటిజ‌న్ల అభిమాన‌కంటెంట్ గా మారిపోయింది! ఇన్ స్టా చూసినా, ఫేస్ బుక్ చూసినా.. ఈ త‌ర‌హా కంటెంట్ కు లైకులు ల‌క్ష‌ల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం! తెలుగు నెటిజ‌న్లు ఇంత ఖాళీగా ఉన్నారా అనే సందేహం ఇక్క‌డ త‌లెత్త‌క మాన‌దు!

సోష‌ల్ మీడియాలో వంటావార్పులు, టూర్లూహోంటూర్లు చేసే వాళ్లు ఒక వైపు నానార‌చ్చ చేస్తూ ఉంటారు. వారిలో కొంద‌రు క్యాష్ చేసుకోవ‌డాన్ని చూసి వాళ్ల‌కు అభిమానులుగా మారే వారు కొంద‌రైతే, వారిని తిడుతూ ర‌చ్చ‌చేసే వాళ్లు ఇంకొంద‌రు! చేదు నిజం ఏమిటంటే.. వీళ్ల‌లో ఎవ‌రికీ స‌ద‌రు వ్లాగ‌ర్లు చేసే ప‌నిమీద ఆస‌క్తి లేదు. వారికి ఎంత డ‌బ్బు వ‌స్తోంది, వారు ఎలా సంపాదిస్తున్నారు.. ఇదే ఆస‌క్తి! లేక‌పోతే వారిలా తాము కూడా చేద్దామ‌నే ప్లాన్ల‌లోనే కాలం గ‌డిపేవారు, వారిని అనుక‌రిద్దామ‌ని ట్రై చేసే వారు, వారిని తిట్టి త‌మ పాపులారిటీ పెంచుకుందామ‌ని చూసే వాళ్లు ఇదో బాప‌తు!

ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సేల్ అవుతున్న‌ది బూతులు! బూతుల‌ను మాట్లాడితే చాలు అనంత‌పురం నుంచి అమెరికా వ‌ర‌కూ తెలుగు వాళ్లంతా తెగ ఆద‌రించేస్తారు! పాట‌ల్లో బూతులు వాడాలి, బూతుల‌నే పాటలుగా పాడాలి, స్వ‌చ్ఛ‌మైన తెలుగును అలా అంత‌ర్జాతీయం చేయాలి! కార్పొరేట్ ఆఫీసుల్లో వేరే రాష్ట్రాల వారికి కూడా తెలుగు బూతుల‌ను మాత్రం తెలుగు నెటిజ‌న్లు బాగా ప‌రిచ‌యం చేస్తూ ఉన్నారు! ఈ వైర‌ల్ స‌రుకు అటు తిరిగి, ఇటు తిరిగి.. ఇత‌ర రాష్ట్రాల వారికీ వెళ్తోంది. వాళ్లు తెలుగు నేర్చుకోకపోయినా, తెలుగు బూతుల మీద మాత్రం ప‌ట్టు సంపాదిస్తూ ఉన్నారు!

గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. సోష‌ల్ మీడియాలో బూతులు మాట్లాడి వైర‌ల్ అవుతున్న వాళ్లెవ్వ‌రి మానసిక స్థితి బాగోలేదు పాపం! వారికి చికిత్స అవ‌స‌రం. అయితే వారిని కామెడీ కోసం వాడుకుంటోంది మొత్తం స‌మాజం! త‌మ‌ను తాము కొట్టుకుంటూ వారు బూతులు మాట్లాడితే అది కామెడీ అంటూ జ‌నాలు ఎగ‌బ‌డి లైకులు కొడుతూ ఉన్నారు, వారిని అడ్డం పెట్టుకుని, వారిని రెచ్చ‌గొట్టి వారి వీడియోల‌తో పాపుల‌ర్ కావాలిని ఇంకొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నారు. ఆ చిల్లర ప్ర‌య‌త్నాల‌కు టీవీ చాన‌ళ్ల ఆశీస్సులు, బూతుల‌తో పాపుల‌ర్ అయిన వారికి ముందుగా టీవీ చాన‌ల్ ఎంట్రీ ఆ పై సూప‌ర్ స్టార్ల సినిమాల్లో వారి బూతులే సాహిత్యం! ఉత్త‌మ సాహిత్యాభిలాష ఉన్న త్రివిక్ర‌మ్, పూరీ వంటి బ‌డాద‌ర్శ‌కుల‌కు వీరే ఆధారం పాపం!

సోష‌ల్ మీడియా వ‌ల్ల రియ‌ల్ టాలెంట్ ఏ మేర‌కు వెలుగు చూస్తోందో కానీ.. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా బూతులు మాట్లాడి వీడియోలు పెడితే మాత్రం త్రివిక్ర‌మ్ సినిమాలోనో, పూరీ సినిమాలోనో మ‌రొక‌రి మూవీలోనే ఛాన్సులు అయితే గ్యారెంటీ లాగున్నాయి!

వెనుక‌టికి జంధ్యాల ఇలాంటి బూతుల పంచాంగాన్నే త‌న సినిమా క‌థాంశంలో వాడుకున్నారు. హైహై నాయ‌క అనే సినిమాలో తెలుగునాట బూతులు మాట్లాడే తీరును ఆయ‌న ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఆ సినిమాల్లో ఎక్క‌డా ఒక్క బూతు వినిపించ‌దు! బూతు బూతు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ పెట్టి.. జంధ్యాల త‌న‌దైన శైలిలో ఆ సీన్ల‌ను రాసి తీశారు.

ఊర్లో ఒక ధ‌నిక కుటుంబంలోని చిన్న పిల్లాడు ఇష్టానుసారం బూతులు మాట్లాడుతూ ఉంటాడు, చిన్నాపెద్దా తేడా లేకుండా టీచ‌ర్ల‌ను కూడా వాడు నానామాట‌లు అంటూ ఉంటాడు, ఆ ఊరికి తెలుగు మాస్టారు, హీరోగా న‌రేష్ వ‌స్తాడు. ఆ పిల్లాడిని సంస్క‌రించ‌డం, న‌రేష్ కు ఒక ల‌వ్ స్టోరీ ఆ సినిమా క‌థ‌. మ‌రి బూతులు మాట్లాడ‌టం సంస్కారం కాదు అనే ధోర‌ణి ఉన్న ఆ స‌మ‌యంలోనే ఆ ధోర‌ణిని ఎండ‌గ‌డుతూ ఒక సున్నిత‌మైన సినిమాను తీశారు జంధ్యాల‌! మ‌రి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెల్లుబుకుతున్న బూతుల‌ను చూస్తే అలాంటి ర‌చ‌యిత‌లు మ‌రెలాంటి సినిమాల‌తో స్పందించేవారో! ఇప్ప‌టి ద‌ర్శకులు బూతుల‌ను క్యాష్ చేసుకోవ‌డంలో బిజీగా ఉన్నారు!

స‌మాజంలో వికృత పోక‌డ‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటిని ఖండించేలా, వాటిలోని త‌ప్పుల‌ను ఎత్తి చూపేలా వెనుక‌టికి సినిమాలు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి వికృత పోక‌డ‌ల‌ను ఆలంబ‌న‌గా చేసుకుని అయినా కాస్త క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టుకోవాలి, ఆ పిచ్చోళ్ల‌కు ఏదో ముష్టిగా ల‌క్ష ఇస్తే చాలు.. వారి బూతుల‌పై వీరికి పేటెంట్ తీసుకోవ‌చ్చు! అదేమంటే అదే ట్రెండ్!

– జీవ‌న్

18 Replies to “బూతులు మాట్లాడితే త్రివిక్ర‌మ్, పూరీ సినిమాల్లో ఛాన్స్!”

  1. త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా హీరో లకి తప్ప మనసు పెట్టి పని చెయ్యడు, అందుకే గుంటూరు కారం సినిమా లో షార్ట్ కట్ రూట్ చూసుకున్నాడు.

    1. నిజం గ ఆ పాట బూతు ల ఉంది అంటారా????? నిజం గ అందులో తప్పు అర్ధం ఉంటె హీరో ఒప్పుకుని ఉంటారా ???ఇప్పుడు జనరేషన్ హీరోల కన్నా (రామ్ ,విజయ్ దేవరకొండ ….)ముందు జనరేషన్ (పవన్ మహేష్ ప్రభాస్ ….) చాల వరకు అసభ్యత ఉన్న సీన్స్ కానీ పాటలు మాటలు కానీ ఎంకరేజ్ చెయ్యడం లేదు కదా

    2. నిజం గ ఆ పాట కి కాయిన్ చేసిన హుక్ వర్డ్ bh00tu ల ఉంది అంటారా????? నిజం గ అందులో తప్పు అర్ధం ఉంటె హీరో ఒప్పుకుని ఉంటారా ??? టాప్ లీగ్ లో ఉన్న హీరోలు చాల వరకు అసభ్యత ఉన్న సీన్స్ కానీ పాటలు మాటలు కానీ ఎంకరేజ్ చెయ్యడం లేదు కదా

      1. మీరు నేను ఏమి అనుకున్నా మీడియా అంతా దాన్ని అశ్లీలం గానే ప్రచారం చేసింది.

    3. అ..ఆ లో బూతులు ఏమి వున్నాయి? మహేష్ ని ఒక మాస్ హీరో గ చూపించాలనే ప్రయత్నం త్రివిక్రమ్ రెండు సార్లు దెబ్బతిన్నాడు. అతడు, పోకిరి లో సక్సెస్ అయ్యారు ఇద్దరు.

    4. అ..ఆ లో బూ/ తు/లు ఏమి వున్నాయి? మహేష్ ని ఒక మాస్ హీరో గ చూపించాలనే ప్రయత్నం త్రివిక్రమ్ రెండు సార్లు దెబ్బతిన్నాడు. అతడు, పోకిరి లో సక్సెస్ అయ్యారు ఇద్దరు.

      1. ఆర్టికల్ రాసింది గుంటూరు కారం సినిమా ని మాత్రమే ఉద్దేశించి (త్రివిక్రమ్ పేరు వాడింది)

  2. రాజకీయాల్లో కూడా గత ప్రభుత్వ పరిపాలనలో బూతులకు మంత్రి పదవులు వచ్చినట్లున్నాయి……

    అప్పుడు వాటిగురించి రాయలేదేమి సామీ

Comments are closed.