కూట‌మి నేత‌ల అక్ర‌మాలు అరిక‌ట్ట‌డానికి ఎన్నెన్ని ఇబ్బందులో!

అధికారంలో వున్న వాళ్ల‌కు అవినీతికి పాల్ప‌డ్డానికి అవ‌కాశం వుంటుంది. విచ్చ‌ల‌విడి అవినీతి జరిగితే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చి అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాలో ఏదో తేడా…

అధికారంలో వున్న వాళ్ల‌కు అవినీతికి పాల్ప‌డ్డానికి అవ‌కాశం వుంటుంది. విచ్చ‌ల‌విడి అవినీతి జరిగితే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చి అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాలో ఏదో తేడా కొడుతోంద‌ని ఆయ‌న అనుమానిస్తున్నారు. కూట‌మి నేత‌లు క్షేత్రస్థాయిలో విప‌రీతంగా ఉచిత ఇసుక‌ను సొమ్ము చేసుకుంటున్నార‌ని ఆయ‌న‌కు నివేదిక‌లు వెళ్లిన‌ట్టు తెలిసింది.

దీంతో ఎలాగైనా ఉచిత ఇసుక‌లో అక్ర‌మాల‌ను అరిక‌ట్టాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే సంపాద‌న కోసం ఆక‌లిగొన్న కూట‌మి నేత‌ల్ని ఆప‌డం త‌న వ‌ల్ల కాద‌ని చంద్ర‌బాబుకు తెలుస్తున్న‌ట్టు లేదు. అయిన‌ప్ప‌టికీ త‌న వంతు ప్ర‌య‌త్నాలు ఆయ‌న ఏవో చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.

ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాలో అక్ర‌మాల‌ను నిరోధించేందుకు లైవ్ శాటిలైట్ డేటాతో పాటు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌)ను ఉప‌యోగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వ‌ర‌లో విధివిధానాల‌ను ప్ర‌భుత్వం రూపొందించ‌నుంది. జీపీఎస్ డేటా ప‌రిధిలోకి తీసుకొచ్చి మ్యాపింగ్ చేయ‌నున్నారు. ఏఐ ద్వారా ఇసుక స్టాక్ నిల్వ‌లు, వినియోగం త‌దిత‌ర వివ‌రాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోనున్నారు.

ఎక్క‌డైనా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిసిన వెంట‌నే అరిక‌ట్ట‌డానికి ఆధునిక సాంకేతి ప‌రిజ్ఞానం వుప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ఉచిత ఇసుక వాహ‌నం ఎక్క‌డికి వెళుతుంద‌నేది కూడా జియో ట్యాగ్ ద్వారా గ‌నుల‌శాఖ ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌రింగ్ చేయ‌నుంది. ఇవ‌న్నీ కూట‌మి నేత‌ల అక్ర‌మాల‌ను అరిక‌ట్ట‌డానికే అని మ‌రిచిపోవ‌ద్దు. ఈ ప‌రిణామాల‌పై కూట‌మి నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

7 Replies to “కూట‌మి నేత‌ల అక్ర‌మాలు అరిక‌ట్ట‌డానికి ఎన్నెన్ని ఇబ్బందులో!”

  1. కనీసం ఆ జాగ్రత్త ఐన teesukuntunnaru …anna లా కమిషన్ లు వాటాలు అడగడం లేదు కదా

  2. Free sand scheme is a big farce and has become means for looting public money by Koorami leaders and supporters. This will definetely become one of the many topics that will doom kootami in 2029.

  3. ఎమ్మెల్సీ అనంత బాబు జగన్మోహన్ రెడ్డితో ఏకాంతంగా రెండు గంటలు ఫోన్ మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఏం చూపించాడు అనే విషయాలు బహిర్గతం చెయ్యాలి అని మా డిమాండ్

Comments are closed.