భార్యాభర్తలుగా మారిన హీరోహీరోయిన్లు

హీరోయిన్ అదితి రావు, హీరో సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నారు. ఎలాగైతే నిశ్చితార్థాన్ని సీక్రెట్ గా, సింపుల్ గా కానిచ్చారో.. పెళ్లి కూడా అదే విధంగా జరిగింది. తామిద్దరం భార్యాభర్తలమయ్యామనే విషయాన్ని ఈ జంట ప్రకటించింది.…

హీరోయిన్ అదితి రావు, హీరో సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నారు. ఎలాగైతే నిశ్చితార్థాన్ని సీక్రెట్ గా, సింపుల్ గా కానిచ్చారో.. పెళ్లి కూడా అదే విధంగా జరిగింది. తామిద్దరం భార్యాభర్తలమయ్యామనే విషయాన్ని ఈ జంట ప్రకటించింది. ఫొటోలు కూడా షేర్ చేసింది.

వనపర్తి ఆస్థానం కేంద్రంగా పాలించిన హైదరీ రాజవంశీయుల కుటుంబం నుంచి వచ్చింది అదితిరావు హైదరీ. ఆమె పూర్వీకులు నిర్మించిన ఆలయంలోనే అదితి-సిద్దార్థ్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు.

తమ పెళ్లి అదే గుడిలో, సంప్రదాయబద్ధంగా జరుగుతుందనే విషయాన్ని అదితిరావు ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చెప్పినట్టుగానే తమిళనాడు, తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో ఈ పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది.

మహాసముద్రం సినిమాతో కలిశారు అదితి-సిద్దార్థ్. చాలా తొందరగానే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ వెంటనే డేటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరి మనసులు కలవడంతో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు.

Click Hero More Photos

4 Replies to “భార్యాభర్తలుగా మారిన హీరోహీరోయిన్లు”

  1. పంతులు చేతిలో శంఖం ఉంచాల్సింది. ఎంత గడ్డం, మీసం తీసి యవ్వనంగా కనబడాలని చూసినా చెవులకు మంత్రాలు వినబడటం లేదు లాగా ఉంది.

Comments are closed.