హీరోయిన్ అదితి రావు, హీరో సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నారు. ఎలాగైతే నిశ్చితార్థాన్ని సీక్రెట్ గా, సింపుల్ గా కానిచ్చారో.. పెళ్లి కూడా అదే విధంగా జరిగింది. తామిద్దరం భార్యాభర్తలమయ్యామనే విషయాన్ని ఈ జంట ప్రకటించింది. ఫొటోలు కూడా షేర్ చేసింది.
వనపర్తి ఆస్థానం కేంద్రంగా పాలించిన హైదరీ రాజవంశీయుల కుటుంబం నుంచి వచ్చింది అదితిరావు హైదరీ. ఆమె పూర్వీకులు నిర్మించిన ఆలయంలోనే అదితి-సిద్దార్థ్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు.
తమ పెళ్లి అదే గుడిలో, సంప్రదాయబద్ధంగా జరుగుతుందనే విషయాన్ని అదితిరావు ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చెప్పినట్టుగానే తమిళనాడు, తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో ఈ పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది.
మహాసముద్రం సినిమాతో కలిశారు అదితి-సిద్దార్థ్. చాలా తొందరగానే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ వెంటనే డేటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరి మనసులు కలవడంతో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు.
Happy married life
పంతులు చేతిలో శంఖం ఉంచాల్సింది. ఎంత గడ్డం, మీసం తీసి యవ్వనంగా కనబడాలని చూసినా చెవులకు మంత్రాలు వినబడటం లేదు లాగా ఉంది.
vc available 9380537747
vc estanu 9380537747