శర్వానంద్ కు యాక్షన్ సినిమాలు పెద్దగా కలిసిరాలేదు. భారీ అంచనాల మధ్య చేసిన మహాసముద్రం, రణరంగం సినిమాలు బోల్తాకొట్టాయి. దీంతో దాదాపు మూడేళ్లుగా ఆ జానర్ వైపు వెళ్లడం మానేశాడు శర్వా.
మళ్లీ ఇన్నేళ్లకు శర్వానంద్ కు ఓ యాక్షన్ కథ నచ్చింది. అది కూడా పీరియాడిక్ కథ కావడం విశేషం. దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ ఇది. 1960ల్లో తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్ లో జరిగే ఓ రూరల్ యాక్షన్ స్టోరీ ఇది.
ఇటు శర్వానంద్ కు, అటు సంపత్ నందికి ఇద్దరికీ ఈ తరహా కథ కొత్త. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కెరీర్ లో శర్వానంద్ కు ఇది 38వ చిత్రం.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవ్వబోతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా పూర్తయిన వెంటనే, మేకోవర్ ప్రక్రియ మొదలవుతుంది. భీమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమాతో ఛార్మింగ్ స్టార్ కాస్తా యాక్షన్ స్టార్ అనిపించుకోవాలని చూస్తున్నాడు.
Action సినిమాలు చేయాలంటే బలమైన ఫ్యాన్ బేస్ ఉండాలి.
శర్వాని చూస్తే ఏమాత్రం ఎనర్జీ లేకుండా నీరసానికి కేరాఫ్ ఎడ్రెస్‌లాగా ఉంటాడు. అతను యాక్షన్ చిత్రం చేసి మెప్పించడం కష్టమే. నాగచైతన్యకి కూడా ఇదే ఇబ్బంది
అయినా థియేటర్లో చూడం