మహేష్ బాబు కూడా కాంప్రమైజ్ అవుతాడా?

మొహమాటానికి పోయి ఇష్టం లేని సినిమాలు చేసే హీరోలున్నారు. రెమ్యూనరేషన్ కు కక్కుర్తిపడి నచ్చని కథలు ఒప్పుకున్న హీరోలున్నారు. ఫ్లాప్ అవుతుందని తెలిసినా కాంబినేషన్ బాగుందని కమిట్ అయ్యే హీరోలు కూడా ఉన్నారు. ఇలాంటి…

మొహమాటానికి పోయి ఇష్టం లేని సినిమాలు చేసే హీరోలున్నారు. రెమ్యూనరేషన్ కు కక్కుర్తిపడి నచ్చని కథలు ఒప్పుకున్న హీరోలున్నారు. ఫ్లాప్ అవుతుందని తెలిసినా కాంబినేషన్ బాగుందని కమిట్ అయ్యే హీరోలు కూడా ఉన్నారు. ఇలాంటి వాటికి అతీతంగా ఉండే హీరోగా మహేష్ బాబుకు పేరుంది.

అవసరమైతే ఏన్నేళ్లయినా ఖాళీగా ఉంటాడు మహేష్, నచ్చని కథ మాత్రం ఒప్పుకోడు. ఈ విషయంలో మణిరత్నం అయితే, గుణశేఖర్ అయినా అతడికి ఒకటే. కథల విషయంలో ఏమాత్రం మొహమాటపడకుండా వ్యవహరిస్తాడనే పేరున్న మహేష్ బాబు కూడా ఓ సందర్భంలో వెనక్కుతగ్గాడు. తప్పనిసరి పరిస్థితుల మధ్య ఓ సినిమా చేశాడు. అదే ఆగడు.

మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటి ఆగడు. నిజానికి మహేష్ చేయాల్సిన సినిమా కాదిది. ప్రాజెక్టు అనుకున్న తర్వాత, కొంత కాలం ట్రావెల్ చేసిన తర్వాత చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆగడు వచ్చింది, ఫ్లాప్ అయింది.

దూకుడు టైమ్ లోనే మహేష్ బాబుకు ఓ అద్భుతమైన స్టోరీలైన్ చెప్పాడట దర్శకుడు శ్రీనువైట్ల. ఆ సినిమా కచ్చితంగా చేస్తానని మహేష్ మాటిచ్చాడు. అదే కథను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత కాల్షీట్లు కూడా ఇచ్చాడు. అయితే నిర్మాతల వల్ల ఆ కథ కాకుండా, మరో కథతో ఆగడు సినిమా చేయాల్సి వచ్చిందంట.

అలా ఈ ప్రాజెక్టు విషయంలో మహేష్ తో పాటు, తను కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని వెల్లడించాడు దర్శకుడు శ్రీనువైట్ల. బడ్జెట్ పరిమితుల వల్ల అసలు కథను వదిలేసి ఆగడు చేయాల్సి వచ్చిందని, అప్పట్లో మహేష్ ఓకే చెప్పిన కథతోనే సినిమా చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

ఆగడు సినిమాతో తన గొయ్యి తానే తవ్వుకున్నట్టయిందని ఒప్పుకున్నాడు వైట్ల. ట్రెండ్ బాగా మారిపోయిందని, అప్పట్లో మహేష్ బాగా ఎక్సయిట్ అయిన ఆ కథను ఇప్పుడు సినిమాగా తీయలేమని కూడా స్పష్టం చేశాడు.

7 Replies to “మహేష్ బాబు కూడా కాంప్రమైజ్ అవుతాడా?”

  1. Mahesh Babu agadu tarvate complete maripoyadu. Bramostavam careless ga chesinatlu unnadu srimantudu hit tho Inka Spyder anukoni mistake murgadoss ina story Nachakapote cheyakudadu ani Spyder tarvata realize iyadu . Anduke tanaki marshi rupamlo oka pedda hit ichina tarvata Vamsi cheppina 2-3 stories nachakapovadam tho pakkana pettesadu andulo okati already Vijay tho chesi chetulu kalchukunaadu Vamsi🙂

Comments are closed.