వరుణ్ తేజ్ కొత్త కథల వెంట పడుతుంటాడని, కొత్తగా కనిపించడానికి పరితపిస్తుంటాడని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లాపులొచ్చినా అతడు పట్టించుకోడు. అయితే మట్కా సినిమాతో అతడు ఈసారి చాలా పెద్ద సాహసమే చేస్తున్నాడనే విషయం తాజాగా రిలీజైన టీజర్ చూస్తే అర్థమౌతుంది.
విజయవాడలోని ఓ థియేటర్ లో మట్కా టీజర్ ను లాంచ్ చేశారు. సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని, సినిమా నేపథ్యాన్ని టీజర్ లో స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు లాంఛింగ్ నుంచి ఊరిస్తున్న వరుణ్ తేజ్ గెటప్స్ ను కూడా బయటపెట్టారు.
అయితే అన్నింటికంటే ఎక్కువ ఆసక్తిరేపిన అంశం ఏంటంటే, మధ్యవయష్కుడిగా వరుణ్ తేజ్ గెటప్. పైగా దానికి నెగెటివ్ షేడ్స్. అది టీజర్ లో ఎక్కువగా ఆకర్షించింది. ఈ ఒక్క షేడ్ చూసి చెప్పొచ్చు, వరుణ్ తేజ్ ఈసారి కాస్త గట్టిగా ట్రై చేస్తున్నాడని.
ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన వాసు అనే పాత్రతో మట్కా సినిమా తెరకెక్కుతోంది. టీజర్ ను కేవలం హీరోకు పరిమితం చేయకుండా, కీలకమైన పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. జీవీ ప్రకాష్ సంగీతం టీజర్ కు అదనపు ఆకర్షణగా నిలిచింది. నవంబర్ 14న థియేటర్లలోకి వస్తోంది మట్కా.
” ఫ్లాపు లొచ్చినా పట్టించు కోడు”…
. నొప్పి నిర్మాత కి కదా…
All the best 👍
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
no matter what like his father he has no talent at all ,better look production or produce movies
veediki acting raadu