తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మైన దువ్వాడ‌, మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, ఆయ‌న స‌న్నిహితురాలు మాధురి సోమ‌వారం తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. రెండు నెల‌లుగా దువ్వాడ కుటుంబంలో చెల‌రేగిన వివాదం గురించి అంద‌రికీ తెలిసిందే. త‌మ కుటుంబంలో మాధురి చిచ్చు రేపింద‌ని దువ్వాడ…

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, ఆయ‌న స‌న్నిహితురాలు మాధురి సోమ‌వారం తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. రెండు నెల‌లుగా దువ్వాడ కుటుంబంలో చెల‌రేగిన వివాదం గురించి అంద‌రికీ తెలిసిందే. త‌మ కుటుంబంలో మాధురి చిచ్చు రేపింద‌ని దువ్వాడ శ్రీ‌నివాస్ భార్య వాణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే త‌మ‌ను ఇంటి నుంచి గెంటేసి మాధురితో శ్రీ‌నివాస్ వుంటున్నాడ‌ని వాణి, వారి కుమార్తెలు ఆరోపించారు.

దువ్వాడ వుంటున్న ఇంట్లోకి వెళ్లేందుకు వాణి, కుమార్తెలు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే వారిని ఇంట్లోకి శ్రీ‌నివాస్ అనుమ‌తించ‌లేదు. చివ‌రికి బాకీలో భాగంగా మాధురి పేరుపై ఇంటిని రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్టు శ్రీ‌నివాస్ వెల్ల‌డించారు. దువ్వాడ కుటుంబంలో వివాదం ఎక్కువ కావ‌డంతో ఆయ‌న్ను టెక్కిలి ఇన్‌చార్జ్‌గా వైసీపీ త‌ప్పించింది. అనంత‌రం వివాదం స‌ర్దుమ‌ణిగింది.

తాజాగా తిరుమ‌ల‌లో ద‌సరా బ్ర‌హ్మోత్మ‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. భారీ సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు వెళ్తున్నారు. దైవ ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో దువ్వాడ‌, ఆయ‌న స‌న్నిహితురాలు మాధురి క‌లిసి తిరుమ‌ల‌కు వెళ్లారు. స్వామివారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆల‌యం వెలుప‌ల మీడియా కంట ప‌డ్డారు. ఆ జంట ఉల్లాసంగా క‌నిపించింది.

దువ్వాడ‌, ఆయ‌న భార్య వాణి మ‌ధ్య విడాకుల వ్య‌వ‌హారం కోర్టులో న‌డుస్తోంది. విడిపోవ‌డానికి నిర్ణ‌యించుకోవ‌డంతో దువ్వాడ వాణి… త‌న భ‌ర్త గురించి ఆలోచించ‌న‌ట్టున్నారు.

8 Replies to “తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మైన దువ్వాడ‌, మాధురి”

  1. “దైవ ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది”

    దేశంలో పాపుల సంఖ్య, అత్యాశాపరుల సంఖ్య పెరిగిపోతోంది.

  2. అంటే సతీ సమేతంగా గుడికి వెళ్లామన్నారు…. ఎవ్వరి సతితో వెళ్లాలో క్లియర్ గా చెప్పలేదు…. అందుకే దువ్వాడ గారు ఇలా

  3. అదేదో saameta

    kadupu పోయినా పురిటి కంపు పోలేదు అని

    మన చెక్కా గాడి గవర్నమెంట్ పోయిన ఆ దరిద్రుడి బులుగు బాచ్ నీచపు పనులు మాత్రం మానట్లేదు

  4. పఒరే నీకు ఒచ్చిన నొప్పి ఏంటి రా

    వారి జీవితాన్ని వాళ్ళని అనుభవించనివ్వండి

    వారందరికీ ఎలాంటి సమస్యలు లేవు మధ్యలో ఆరికట్ల గాడికి వచ్చిన సమస్య ఏంటో ?

    ఒకే ఒక్క జీవితం ఉంది, వారిని ఎవరి వ్యవహారాలు, నాటకాల గురించి కాకుండా వేరే వాటి దృష్టి పెట్టు APలో ఇతర ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి జగన్ ని 11నుంచి 18 కి ఎలా తీసుకురావాలి అని ఆలోచించు 2029 నాటికి కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేలా ఆర్టికల్స్ వదులు .

Comments are closed.