నిఖిల్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తన సినిమా కానట్టు వ్యవహరిస్తున్నాడు. తనకు పాన్ ఇండియా అప్పీల్ రాకముందు అంగీకరించిన సినిమాల్ని అతడు లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇది ఎంత వరకు కరెక్ట్?
“అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” అనే టైటిల్ తో నిఖిల్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దీపావళికి రిలీజ్ అని కూడా ప్రకటించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కడ్నుంచి ఊడిపడిందనే సందేహం అందర్లో మొదలైంది.
ఆ సందేహం నిజమే, దాదాపు మూడేళ్ల కిందటి సినిమా ఇది. ఇది ఎప్పటి సినిమా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అది నిఖిల్ అంగీకరించిన సినిమా. రెమ్యూనరేషన్ తీసుకొని చేసిన సినిమా. కాబట్టి దానికి ప్రచారం చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కానీ నిఖిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడా ఈ సినిమా ప్రస్తావన లేదు.
ప్రస్తుతం తన చేతిలో ఉన్నది స్వయంభూ సినిమా మాత్రమే అన్నట్టు వ్యవహరిస్తున్నాడు నిఖిల్. జనాలు కూడా అలానే ట్యూన్ అయ్యారు. కానీ ఉరుము లేని మెరుపులా నిఖిల్ కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. అంతమాత్రాన ఇది అతడి సినిమా కాకుండా పోతుందా?
మొన్నటికిమొన్న స్పై సినిమా విషయంలో కూడా ఇలానే వ్యవహరించాడు నిఖిల్. చాలా రోజులు ప్రచారానికి దూరంగా ఉంటూ వచ్చి, ఆఖరి నిమిషంలో ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడింది. ఇప్పుడీ కొత్త సినిమా విషయంలో కూడా నిఖిల్ వ్యవహారశైలి అలానే కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనైనా ఈ సినిమాకు నిఖిల్ ప్రచారం చేస్తాడో చేయడో చూడాలి.
Call boy jobs available 9989793850
“తనకు పాన్ ఇండియా అప్పీల్ రాకముందు…” ఎవరికీ? నిఖిల్ కే పాన్-ఇండియా అప్పీలు..?? 🙂
vc estanu 9380537747
vadi cinema vaadi istham. neekenduku noppi.
పాన్ ఇండియా అంటే ఇంటి ముందు పాన్ షాప్ లా తయారైంది…
ప్రచారం చేసినా, చెయ్యకున్నా మేం థియేటర్లో చూడం