జ‌గ‌న్ పుంగ‌నూరు ప‌ర్య‌ట‌న ర‌ద్దు!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది. ఈ నెల 9న జ‌గ‌న్ అక్క‌డికి వెళ్లాల్సి వుండింది. ఇటీవ‌ల ఏడేళ్ల బాలిక హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే.…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది. ఈ నెల 9న జ‌గ‌న్ అక్క‌డికి వెళ్లాల్సి వుండింది. ఇటీవ‌ల ఏడేళ్ల బాలిక హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. బాలిక కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి జ‌గ‌న్ వెళ్తార‌ని వైసీపీ ఒక ప్ర‌క‌ట‌న ఇచ్చింది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

జ‌గ‌న్ వెళ్తే ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు భ‌య‌ప‌డ్డారు. దీంతో ముగ్గురు మంత్రుల్ని అక్క‌డికి పంపారు. అలాగే హత్య కేసులో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత‌ల మాట‌ల్ని న‌మ్మొద్ద‌ని హోంమంత్రి అనిత అన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా వుంటామ‌ని మంత్రులు ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యిన‌ట్టు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌ని తెలియ‌గానే మంత్రులు ప‌రుగునా పుంగూరుకు వ‌చ్చార‌న్నారు. క‌ర్నూలు జిల్లా ముచ్చుమ‌ర్రిలో బాలిక హ‌త్య కేసులో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయ్యి వుంటే, ఇవాళ పుంగ‌నూరులో పున‌రావృతం అయ్యేది కాద‌న్నారు. ఇప్ప‌టికైనా హ‌త్య కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నార‌న్నారు.

కూట‌మి పాల‌న‌లో అమ్మాయిల‌పై అఘాయిత్యాల‌పై పెరిగాయ‌ని ఆయ‌న ఆరోపించారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న ఉన్న‌ట్టుగా లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌క్ష‌పూరిత పాల‌న‌కే ప్ర‌భుత్వానికి స‌మ‌యం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

13 Replies to “జ‌గ‌న్ పుంగ‌నూరు ప‌ర్య‌ట‌న ర‌ద్దు!”

  1. అంటే మంత్రులు పరుగున వెళ్లి కలిస్తే ప్రతిపక్షం పరామిర్షవించావా? ఇదెక్కడి లాజిక్

  2. This is 2 muslim family problems, why involved cm and ex cm and ministers, what is this news paper not a shame to you, for this news circulate

  3. అంటే వీడికి స్టెబిలిటీ లేదనా నీ ఉద్దేశం? తిరుమల పర్యటన రద్దు, పుంగనూరు పర్యటన రద్దు !! భయపడ్డాడా suntta!!

Comments are closed.