‘క’ పాట

కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా ‘క’. బ్యానర్ పేరు ‘క’. క అంటే ఇంగ్లీష్ లో కిరణ్ అబ్బవరం. అయనకు అదో తృప్తి అనుకోవాలి. నిజానికి మంచి టైటిల్ పెడితే సినిమా ఇంకా బలంగా…

కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా ‘క’. బ్యానర్ పేరు ‘క’. క అంటే ఇంగ్లీష్ లో కిరణ్ అబ్బవరం. అయనకు అదో తృప్తి అనుకోవాలి. నిజానికి మంచి టైటిల్ పెడితే సినిమా ఇంకా బలంగా జ‌నాల్లోకి వెళ్తుంది. సరే అది వేరే సంగతి.

ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ జాతర పాట వదిలారు. భారీగా చిత్రీకరించారు. ఖర్చు కనిపిస్తోంది. పాట ట్యూన్ కాస్త తమిళ్ స్టయిల్ లో వుంది. శామ్ సిఎస్ సంగీతం అందించడం వరకు ఓకె. కానీ ట్యూన్ కు ఎక్కువగా లిరిక్స్ అందించలేదు.. లేదా అక్కడ స్కోప్ లేదు రచయిత సేనాపతి భరద్వాజ‌ పాత్రుడు కి.

అ విషయం పక్కన పెడితే చిత్రీకరణ బాగుంది. పెద్ద తెరమీద భారీగా కనిపిస్తుంది. హీరో కిరణ్ అబ్బవరం ఎనర్జ‌టిక్ గా డ్యాన్స్ చేసారు. నయన్ సారిక, తన్వీ రామ్ కూడా ఈ డ్యాన్స్ కు తోడయ్యారు. భారీ సెట్, భారీ జూనియర్ అర్టిస్ట్ లు, నైట్ పిక్చరైజేష‌న్ ఇవన్నీ కలిసి జాతరసాంగ్ ను చూసేలా చేసాయి.

చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులు వంశీ నందిపాటి తీసుకున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు.

2 Replies to “‘క’ పాట”

Comments are closed.