రత్నవేలు ఫ్రేమ్ ల మీద అసంతృప్తి?

దేవర సినిమా కంటెంట్ వచ్చినపుడల్లా చిన్న వెలితి. లుంగీ గెటప్ లో ఎన్టీఅర్ కాస్త పొట్టిగా కనిపిస్తున్నాడు అని. నిజానికి ఎన్టీఅర్ మరీ అంత పొట్టి కాదు. పైగా సినిమాటోగ్రాఫర్ తలుచుకుంటే అటు ఇటు…

దేవర సినిమా కంటెంట్ వచ్చినపుడల్లా చిన్న వెలితి. లుంగీ గెటప్ లో ఎన్టీఅర్ కాస్త పొట్టిగా కనిపిస్తున్నాడు అని. నిజానికి ఎన్టీఅర్ మరీ అంత పొట్టి కాదు. పైగా సినిమాటోగ్రాఫర్ తలుచుకుంటే అటు ఇటు సవరించడం అన్నది కామన్. కానీ అలా జ‌రగలేదు. దీంతో సినిమా విడుదలకు ముందు కాస్త ట్రోలింగ్ కూడా నడిచింది. రత్నవేలు పెద్ద సినిమాటోగ్రాఫర్. బాగా పేరు వున్నవాడు. మంచి ప్రాజెక్ట్ లు చేసిన వాడు. కానీ ఎందుకో దేవర విషయంలో పూర్తి టాలెంట్ ప్రదర్శించినట్లు కనిపించలేదు.

దేవర 2 ప్రారంభం అయితే ఈసారి రత్నవేలును రీప్లేస్ చేస్తారా? అనే గ్యాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. దేవర 2 ఇప్పట్లో ప్రారంభం కాదు. ఎందుకంటే ఎన్టీఅర్ హిందీ కమిట్ మెంట్లు వున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా వుంది. ఇవన్నీ పూర్తి కావాలంటే ఏడాది సమయం కనీసం పడుతుంది.

ప్రశాంత్ నీల్ వేగంగానే తీస్తారు. అలాగే ఎన్టీఅర్ కూడా వేగంగానే చేస్తారు. అందువల్ల ఈ ఏడాది నుంచి ఏడాది లోపు ప్రశాంత్ నీల్ సినిమా ఫినిష్ అయిపోవచ్చు. అ తరువాత దేవర 2 కు శ్రీకారం చుట్టే అవకాశం వుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది చివర్లో స్టార్ట్ చేద్దాం అని కొరటాలకు ఎన్టీఅర్ చెప్పినట్లు తెలుస్తోంది.

అదే జ‌రిగితే అప్పటికి బుచ్చిబాబు- రామ్ చరణ్ సినిమా మీద బిజీగా వుంటారు రత్నవేలు. అ కారణంగానూ, దేవర వన్ లో ఫ్రేమ్ ల మీద వున్న హీరో అసంతృప్తి కారణంగానూ రత్నవేలును మారుస్తారేమో అన్న గ్యాసిప్ మొదలై వుండొచ్చు.

4 Replies to “రత్నవేలు ఫ్రేమ్ ల మీద అసంతృప్తి?”

Comments are closed.