కాంతార బాటలో వేట్టయన్

కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్టయింది. దీంతో ఆటోమేటిగ్గా దానికి కొనసాగింపు ప్రకటించారు. అయితే అందరిలా సీక్వెల్ కాకుండా, కాంతారాకు ప్రీక్వెల్ చేస్తున్నారు. ఇప్పుడు వేట్టయన్ కూడా అదే దారిలో నడుస్తోంది. Advertisement కుదిరితే రజనీకాంత్…

కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్టయింది. దీంతో ఆటోమేటిగ్గా దానికి కొనసాగింపు ప్రకటించారు. అయితే అందరిలా సీక్వెల్ కాకుండా, కాంతారాకు ప్రీక్వెల్ చేస్తున్నారు. ఇప్పుడు వేట్టయన్ కూడా అదే దారిలో నడుస్తోంది.

కుదిరితే రజనీకాంత్ తో వేట్టయన్ సినిమాకు ప్రీక్వెల్ చేస్తానని అంటున్నాడు దర్శకుడు జ్ఞానవేల్. వేట్టయన్ లో అథియన్ పాత్రలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ ను చూపించిన ఈ దర్శకుడు.. అసలు రజనీకాంత్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మారారనే విషయాన్ని ప్రీక్వెల్ లో చెబుతానంటున్నాడు.

సినిమాలో ఫహాద్ ఫాజిల్ ను దొంగ నుంచి పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారిన వ్యక్తిగా చూపించాడు దర్శకుడు. ప్రీక్వెల్ లో ఫహాద్ ఫాసిల్ పాత్రను పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తానని, అతడు ఎలాంటి దొంగతనాలు చేశాడు, అతడిలో రజనీకాంత్ ఎలా మార్పు తీసుకొచ్చారనే విషయాల్ని చూపిస్తానంటున్నాడు.

వెట్టయాన్ లో రజనీకాంత్ శ్వాగ్ ను అక్కడక్కడ ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. తన కథ-సందేశం మిస్ అవ్వకుండా, ప్రీక్వెల్ లో కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశించే అన్ని గూస్ బంప్ మూమెంట్స్ పెడతానంటున్నాడు. చూస్తుంటే.. ఈ దర్శకుడికి రజనీకాంత్ మరో ఛాన్స్ ఇచ్చేలా ఉన్నారు.

4 Replies to “కాంతార బాటలో వేట్టయన్”

Comments are closed.