ఎట్టకేలకు ‘ఎమర్జెన్సీ’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. అన్నీ తానై కంగనా రనౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది.
“మా ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినందుకు సంతోషిస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం.” అంటూ ట్వీట్ చేసింది కంగన.
స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించింది. లెక్కప్రకారం ఈ సినిమా గతేడాది నవంబర్ లో రిలీజ్ కావాలి, ఆ తర్వాత ఈ ఏడాది జూన్ కు, ఆ తర్వాత సెప్టెంబర్ 6కి వాయిదా పడింది.
సెన్సార్ అభ్యంతరాల వల్ల ఈ సినిమా ఇలా పలుమార్లు వాయిదా పడింది. ఇందిరాగాంధీ పాలనలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 21 నెలల ఎమర్జెన్సీ కేంద్రంగా కంగనా తీసిన ఈ సినిమాపై పలు సిక్కు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డ్ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్టు స్వయంగా కంగనా గతంలో ఆరోపించింది.
ఇందిరాగాంధీ హత్య, పంజాబ్ అల్లర్లు, భింద్రన్ వాలే పాత్రను చూపించొద్దంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అటు సెన్సార్ బోర్డు కూడా ఈ చిత్రంపై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జాతీయ సమగ్రత, కథలో సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పలు కట్స్ సూచించింది.
అయితే ప్రారంభంలో ఆ కట్స్ కు కంగనా అంగీకరించలేదు. సెన్సార్ బోర్డ్ కూడా వెనక్కు తగ్గకపోవడంతో, కొన్ని కట్స్ కు ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది.
ఈ సినిమా వల్ల ఆర్థికంగా తను చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కంగనా ఇటీవల వెల్లడించింది. ఈ సినిమా అప్పులు, వడ్డీలు తీర్చేందుకు, ముంబయిలో తనకు ఎంతో ఇష్టమైన ప్రాపర్టీని కూడా ఈమధ్య ఆమె అమ్మేసింది.
ఐనా థియేటర్లో చూడం