తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేయాలని, తన నటన మార్చుకోవాలని, అన్ని విధాలా అలోచించి, పూర్తిగా కంటెంట్ మీద నమ్మకం పెట్టి చేసిన సినిమా ‘క’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. తన లేటెస్ట్ సినిమా ‘క’ విడుదల సందర్భంగా గ్రేట్ అంధ్రతో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి లౌక్యం, రాజకీయం కావాలని, అవి తనకు ఇంకా పట్టుబడలేదని ఈ సందర్భంగా అన్నారు.
తాను మంచి స్క్రిప్ట్ లు ఎంచుకుంటున్నా, ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో తేడా వస్తోందని అన్నారు. మొదటి రెండు సినిమాలు తాను అన్నీ చూసుకున్నా అని, తరువాత పెద్ద బ్యానర్లలో నటించినపుడు, కేవలం తన పాత్ర వరకే చూసుకుని వదిలేసానని చెప్పారు. కానీ అవి విజయం సాధించకపోవడంతో, అన్నీ జాగత్తగా చూసుకుని ఈ సినిమా చేస్తున్నా అని అన్నారు. నిజానికి ఇలా చేయడం వల్ల తనకు చాలా ప్రెజర్ గా వుంటోందని చెప్పారు.
క అనే టైటిల్ పెట్టాలని తాను అనుకోలేదని, క అంటే కిరణ్ అబ్బవరం అనే మీనింగ్ వచ్చి, తనేదో తన పేరు పెట్టుకుంటున్నా అని అనుకుంటారని భావించా అని, అయితే సినిమాకు అదే టైటిల్ చాలా అవసరం అని అందరూ అనడంతో ఒకె అన్నానని వివరించారు. ఈ సినిమా మిస్టిక్ జానర్ అయినా, ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుందని చెప్పారు. నిజానికి ఈ కథను ఇద్దరు నిర్మాతలకు చెబితే కొత్త ప్రయోగం అని వెనుకంజ వేసారన్నారు. అందుకే తాను టేకప్ చేయాల్సి వచ్చిందన్నారు.
సినిమాకు బాగా ఖర్చయిందని, అందువల్లే రేటు ఎక్కువ అఫర్ చేసిన వారికి ఇవ్వాల్సి వచ్చిందని, దీని వల్ల థియేటర్ల ఇబ్బంది వస్తుందనే టెన్షన్ వుంది కానీ అందరినీ కలిసి మాట్లాడి సర్దుబాటు చేసుకుంటా అన్నారు. వరుస సెలవులు వుండడం వల్ల మిగిలిన సినిమాలు అన్నీ ముందు చూసినా, తమ సినిమా కూడా తరువాత అయినా చూస్తారనే నమ్మకం వుందన్నారు.
మన కులం, మన పార్టీ సానుభూతి పరుడు. అలాగే కానీయండి… మోసేయండి
మారినా థియేటర్లో చూడం