తండేల్ సంక్రాంతి విడుదల వెనుక..!

సంక్రాంతికి వస్తాము అంటే నెట్ ఫ్లిక్స్ కొంత మొత్తం తగ్గిస్తుంది, సంక్రాంతికి వస్తే థియేటర్ రెవెన్యూ బాగుంటుంది.

ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ఒక హడావుడి, నాగ్ చైతన్య తండేల్ సినిమా క్రిస్మస్ కు కాకుండా సంక్రాంతికి వస్తుందని. నిజ‌మా? కాదా? అసలు ఏం జ‌రుగుతోంది అని కనుక్కుంటే.. విడుదల సంగతి అలా వుంచి, సంక్రాంతికి వస్తే, కొంత ఓటీటీ సొమ్ము వదలుకోవాల్సి వస్తుందని తెలిసింది. అదెలా అంటే, సినిమాను నెట్ ఫ్లిక్స్ కు ఓటీటీ హక్కులు అమ్మేసారు. వాళ్లు చెప్పినపుడు విడుదల డేట్ వేయాలి. అలా కాకుండా విడుదల డేట్ వేస్తే వాళ్లు ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నంత డబ్బు ఇవ్వరట. ఇప్పుడు అదే డిస్కషన్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

సంక్రాంతికి వస్తాము అంటే నెట్ ఫ్లిక్స్ కొంత మొత్తం తగ్గిస్తుంది, సంక్రాంతికి వస్తే థియేటర్ రెవెన్యూ బాగుంటుంది. అందుకే సంక్రాంతికి రావాలి, కానీ నెట్ ఫ్లిక్స్ ఎంత వరకు తగ్గిస్తుంది అన్నది చూడాలి, మూడు.. నాలుగు కోట్ల వరకు అయితే ఫరవాలేదు. అ మేరకు సంక్రాంతి సీజ‌న్ కవర్ చేస్తుంది. అలా కాకుండా ఇంకా ఎక్కువ అంటే మాత్రం కష్టమే. ఈ మేరకు నిర్మాత అరవింద్ త్వరలో నెట్ ఫ్లిక్స్ అధికారులతో తో సమావేశం అవుతారని తెలుస్తోంది.

ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న బాలయ్య- సితార సంస్థ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ తో మాట్లాడి రేటు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి వస్తోంది. దాని మీద గీతా సంస్థ సినిమా రావడం అంటే కాస్త అలజ‌డి వుంటుంది మెగా ఫ్యాన్స్ లో. ఈ మేరకు కూడా అల్లు అరవింద్ నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ఇప్పటి వరకు వున్న సమాచారం ప్రకారం సంక్రాంతికే రావడానికి ఎక్కువ అవకాశం వుంది.

7 Replies to “తండేల్ సంక్రాంతి విడుదల వెనుక..!”

Comments are closed.