పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్‌

రాజంపేట ఎంపీ, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్ మంజూరైంది. కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి రావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్య‌ర్థుల‌పై టీడీపీ నాయ‌కులు దాడుల‌కు తెగ‌బడ్డారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయ‌ప‌డిన…

రాజంపేట ఎంపీ, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్ మంజూరైంది. కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి రావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్య‌ర్థుల‌పై టీడీపీ నాయ‌కులు దాడుల‌కు తెగ‌బడ్డారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించేందుకు జూలైలో మిథున్‌రెడ్డి పుంగ‌నూరు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

స‌మావేశానికై హాజ‌రై ధైర్యం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టాయి. మిథున్‌రెడ్డిపై దాడికి య‌త్నించాయి. రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్లు రువ్వారు. అలాగే రెడ్డెప్ప కారును ధ్వంసం చేశారు. టీడీపీ దాడిలో కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు గాయాల‌పాల‌య్యారు.

మిథున్‌రెడ్డిపై దాడికి పాల్ప‌డ‌డ‌మే కాకుండా, ఆయ‌న‌పై కేసు పెట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏపీ హైకోర్టును మిథున్‌రెడ్డి ఆశ్ర‌యించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు… తీర్పును రిజ‌ర్వ్ చేసి, ఇవాళ వెలువ‌రించింది. మిథున్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిథున్‌రెడ్డికి ఊపిరి పీల్చుకున్నారు.

టీడీపీ ట్రాప్‌లో ప‌డి త‌మ‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న వారు భ‌విష్య‌త్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌ని ఆ మ‌ధ్య మిథున్‌రెడ్డి హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

6 Replies to “పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్‌”

  1. పాపం వీడికి పుంగనూరు వెళ్ళే అంత సీన్ కూడా లెదు అంటావా? అంతె అధికారం ఉన్ననొల్లు తెగ రెచ్చి పొయారు!

    .

    చంద్రబాబు జగన్ లా బరితెగించరు కాని, అయినా వీడిని లొపల వెయాలి అని నిజంగా అనుకుంటె ఎంత సెపు!

  2. రామచంద్ర యాదవ్ and చంద్రబాబు ని రాళ్ళతో కొట్టించి ఎదురు ‘కేసులు పెట్టిన దానిమీద విచారణ అంటూ దె0కొచ్చి లోపలేసి కుమ్మితే ఈడి అబ్బ.. అబ్బా అనాలి..

  3. ప్రపంచ రికార్డు నెలకొల్పిన మిథున్ రెడ్డి…గుణిన్స్ రికార్డు సాధించిన మిథున్ రెడ్డి లెవెల్ ఎలేవేషన్ గ …ముందస్తు బెయిల్ కి

Comments are closed.