సుజిత్ సినిమా చేతులు మారింది

పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తున్నారు దర్శకుడు సుజిత్. ఈ సినిమాకు నిర్మాత డివివి దానయ్య, ఈ సంగతి తెలిసిందే. అదే సుజిత్ తో మరో సినిమా హీరో నాని కాంబినేషన్ లో చేయాలని…

పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తున్నారు దర్శకుడు సుజిత్. ఈ సినిమాకు నిర్మాత డివివి దానయ్య, ఈ సంగతి తెలిసిందే. అదే సుజిత్ తో మరో సినిమా హీరో నాని కాంబినేషన్ లో చేయాలని అనుకున్నారు దానయ్య. అదీ తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల అది జస్ట్ అలోచన దశలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఓజీ షూటింగ్ ఓ కొలిక్కి వస్తోంది. నాని చేస్తున్న హిట్ 3 కూడా చకచకా షూట్ జరుగుతోంది. దాని తరువాత దసరా డైరక్టర్ తో సినిమా చేయాల్సి వుంది.

కానీ ఓజీ డైరక్టర్ సుజిత్ తో సినిమా వదలుకోవాలని లేదు నానికి. మాఫియా బ్యాక్ డ్రాప్ స్టయిలిష్ యాక్షన్ సినిమా. అందుకే ఇప్పుడు అ ప్రాజెక్ట్ ను తీసుకెళ్లి మరో నిర్మాతకు అప్పగించారు. గతంలో శ్యామ్ సింగ రాయ్ లాంటి మంచి సినిమా తీసిన నిర్మాత వెంకట్ బోయనపల్లి నాని- సుజిత్ సినిమాను నిర్మించబోతున్నారు.

దానయ్యకు అవసరం అయితే మరో సినిమా చేస్తారు నాని. అలాగే సుజిత్ కు కూడా వేరే కమిట్ మెంట్లు వున్నాయి. అవి కూడా పుల్ ఫిల్ చేయాల్సి వుంటుంది దీని తరువాతనో, ముందుగానే. ఇక్కడ మరో గమ్మత్తు ఏమిటంటే శ్యామ్ సింగరాయ్ సినిమాను సితార సంస్థలో ప్లాన్ చేసారు. వర్కవుట్ కాదనే అలోచన చేయడంతో తీసుకెళ్లి వెంకట్ బోయనపల్లి దగ్గర పెట్టారు.

ఇప్పుడు సుజిత్ సినిమా బడ్జెట్ గురించి నిర్మాత దానయ్య ముందు వెనుకలు అడడంతో, తీసుకెళ్లి అదే బోయనపల్లి వెంకట్ దగ్గర పెట్టారు.

4 Replies to “సుజిత్ సినిమా చేతులు మారింది”

Comments are closed.