తండేల్ సినిమా రిలీజ్ పై ఇటు హీరో, అటు దర్శకుడు ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇద్దరూ కలిసి మేటర్ ను అల్లు అరవింద్ పైకి నెట్టేసిన సంగతి తెలిసిందే.
సంక్రాంతికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ చరణ్ సినిమా ఉంది కాబట్టి అరవింద్ ఆలోచిస్తున్నారని.. అదే విధంగా వెంకటేష్ మూవీ వస్తోంది కాబట్టి చైతూ ఆలోచిస్తున్నాడని చెప్పాడు దర్శకుడు చందు. అటు చైతూ అయితే ఏకంగా అల్లు అరవింద్ పేరు చెప్పి తప్పించుకున్నాడు, ఆయన సరైన నిర్ణయమే తీసుకుంటారని అన్నాడు.
కట్ చేస్తే, తండేల్ వాయిదా వెనక మరో రీజన్ కూడా కనిపిస్తోంది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి నాగచైతన్య పెళ్లి కూడా ఓ కారణమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. నాగచైతన్య-శోభిత డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి చేసుకోబోతున్నారు.
పెళ్లి, తదనంతర కార్యక్రమాల కోసం కొన్ని వారాల గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడట చైతూ. నాగచైతన్యకు ఆ గ్యాప్ ఇవ్వాలంటే క్రిస్మస్ లేదా సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. అందుకే తండేల్ సినిమాను సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు ఇన్ సైడ్ టాక్.
నాగచైతన్య-శోభిత పెళ్లి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులకు శుభలేఖలు అందుతాయి. ఆగస్ట్ లో వీళ్ల నిశ్చితార్థం జరిగింది.
Nice couple
Call boy works 9989793850
vc estanu 9380537747