ఇదికదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే..!

తెలంగాణ వర్తమాన రాజకీయం అంటే మూసీ నది తప్ప మరొకటి లేదు అన్నట్టుగా కొన్ని వారాలుగా నానా రచ్చ నడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల వారికి కొన్నాళ్లుగా వేరే ఎజెండా ఏమీ లేదు. కేవలం…

తెలంగాణ వర్తమాన రాజకీయం అంటే మూసీ నది తప్ప మరొకటి లేదు అన్నట్టుగా కొన్ని వారాలుగా నానా రచ్చ నడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల వారికి కొన్నాళ్లుగా వేరే ఎజెండా ఏమీ లేదు. కేవలం మూసీ మాత్రమే. మూసీనదిని బాగు చేయకూడదని అనుకుంటున్నారా? అక్కడి పేద ప్రజలు అలా స్లమ్ లో మగ్గిపోవాల్సిందేనా? మంచి ఇళ్లలోకి వెళ్లకూడదని కోరుకుంటున్నారా? అంటూ కాంగ్రెస్ అరచి గీపెడుతుంది.

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం అంటూ బిజెపి గోల చేస్తుంది. పేదల ఇళ్లు అనే టాపిక్ తో పాటు, లంచాలకోసమే ఈ పనిచేస్తున్నారంటూ భారాస గగ్గోలు పెడుతుంది. ప్రపంచంలోనే మరొక అంశం లేదన్నట్టుగా అన్ని పార్టీలు చెలరేగిపోయాయి. తీరా ఇప్పుడు ఈ ఇష్యూ మీద నుంచి తాత్కాలికంగానే కావొచ్చు గానీ.. సమర్థంగా ప్రజల దృష్టిని పక్కకు మళ్లించగలిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో లిక్కర్ పార్టీ.. డ్రగ్స్ అందిస్తున్నారనే ఆరోపణలు చుట్టూ కథ నడపడం ద్వారా.. అసలు సిసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో చూపిస్తున్నారు.

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో (లేదా ఫామ్ హౌస్ లో) లిక్కర్ పార్టీ జరిగింది. అక్కడేదో వీరబీభత్సమైన రేవ్ పార్టీ జరుగుతున్నదన్నంత బిల్డప్ తో ఎక్సయిజ్ మరియు పోలీసులు తెల్లవారుజామున దాడిచేసి హడావుడి చేశారు. అనేక మంది పురుషుల్ని మహిళల్ని అదుపులోకి తీసుకుని వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అందరిలోకి కలిపి విజయ్ మద్దూరి అనే ఒక్కరికి మాత్రమే కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి మీద కేసు పెట్టినా సరిపోతుంది.

కానీ పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు, విజయ్ మద్దూరి చెప్పారంటూ రాజ్ పాకాల మీద కూడా కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల పరారీలో ఉన్నాడన్నారు. పార్టీ జరిగిన చోట కేవలం కొన్ని విదేశీ మద్యం సీసాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అది ఎంత పెద్ద ఘోరమైన నేరంగా నిరూపణ అవుతుందో తెలియదు.

కానీ పోలీసులు అక్కడితే ఆగలేదు. రాయదుర్గంలోని గేటెడ్ కమ్యూనిటీలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో సోదాలు నిర్వహించారు. అడ్డుకున్న భారాస నేతల్ని అరెస్టు చేసి రాద్దాంతం చేశారు. తలుపులు పగులగొట్టి మరీ లోనికి వెళ్లి సోదాలు నిర్వహించారు. విజయ్ మద్దూరికి డ్రగ్స్ ఇచ్చినట్టుగా చెప్పారు కాబట్టి.. రాజ్ పాకాల ఇంట్లో డ్రగ్స్ దొరుకుతాయనేది వారి అంచనా. విదేశీ మద్యం సీసాలు తప్ప మరేం దొరకలేదు. తీరా రాజ్ పాకాల పోలీసులకు దొరికి, విచారణకు కూడా హాజరైన తర్వాత.. అసలు విజయ్ మద్దూరి తన పేరు చెప్పనేలేదని అంటున్నారు.

తమాషా ఏంటంటే.. రెండు మూడు రోజులుగా రాజ్ పాకాల ఫాంహౌస్ లో పార్టీ, డ్రగ్స్ లేదా అక్రమ లిక్కర్ వ్యవహారం ఒక్కటే రాష్ట్రానికి అతిపెద్ద సమస్యలాగా అందరూ దాని గురించి మాట్లాడుకునేలా డైవర్ట్ చేస్తున్నారు. మీడియా అటెన్షన్ కూడా ఎక్కువగా అటువైపు ఉండేలా చేశారు. చాలా సింపుల్ విషయాలకు పెద్ద యాగీ చేయడం ద్వారా సక్సెస్ అయ్యారు. అసలు సిసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇవి కదా.. అని ప్రజలు విస్తుపోతున్నారు.

14 Replies to “ఇదికదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే..!”

  1. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, విజయ్ మద్దూరి , కేటీఆర్ ఈ ముగ్గురు ఎంతో మంది అమ్మాయిలని , హీరోయిన్స్ ని రేవ్ పార్టీ పేరు చెప్పి చెరిచారు అని తెలంగాణ లో అందరికి తెలుసు , వాళ్ళని వెనకేసుకురావటం సిగ్గుగా లేదా GAనీచుడా ?

    1. ఈ విజయ్ మద్దూరి డర్టీ హరి అనే ఒక అడల్ట్ పిక్చర్ కి సహా నిర్మాత..ms Raju direction lo తెలుగు లో మొట్టమొదటి OTT app Friday movies App దీన్ని ,(Vijay IT comp) development chesaru

  2. కేటీఆర్ దివాలి దావత్ అన్నాడు, మరి మద్యం బాటిల్స్ దొరికాయి. అసలు పండగ పేరు చెప్పి తాగడం ఏంట్రా బాబు.

  3. కేటీఆర్ దివాలి దావత్ అన్నాడు, మరి మ ద్యం బాటిల్స్ దొరికాయి. అసలు పండగ పేరు చెప్పి తా గడం ఏంట్రా బాబు.

  4. కే టీఆర్ ది వాలి దా వత్ అన్నాడు, మరి మ ద్యం బా టిల్స్ దొరికాయి. అసలు పండగ పేరు చెప్పి తాగడం ఏంట్రా బాబు.

  5. మీడియా కు డబ్బులు ఇచ్చి, కావాల్సిన దాన్ని హైప్ చేయడం అధికారపార్టీ కి, పోలీసులకు అలవాటు. ఒక కుక్కను చంపాలి అంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురు అమాయకులను పట్టుకుని నిందితులుగా ప్రచారం చేశారు. వారిపై దిక్కుమాలిన కథలు, ఆరోపణలు సృష్టించారు.ఆ తర్వాత ఎన్కౌంటర్ లో చంపేశారు. అంతా బూటకం అని సుప్రీం కోర్ట్ వేసిన కమిషన్ తేల్చేసింది. పొలిసు టీం తో పాటు శ్రీ సజ్జనార్ గారిపైనా హత్యానేరం కేసు నమోదు చేయమని సిఫార్సు చేసింది. ఆ నివేదికను హై కోర్ట్ లో సవాల్ చేశారు. ఏముంది? షరా మాములే. మన జడ్జిగారు ఆ నివేదికను చెత్తబుట్టలో పడేసారు.కథ సుఖంతం. శుభం కార్డు పడినట్లే. ఇంతకీ ప్రియాంక రెడ్డి ని ఎవరు చంపారు? అని ఎవరైనా అడిగితె, వారిపైన కేసు బుక్ చెస్తారు

  6. మీడియా కు డబ్బులు ఇచ్చి, కావాల్సిన దాన్ని హైప్ చేయడం అధికారపార్టీ కి, పోలీసులకు అలవాటు. ఒకే కుక్కను చంపాలి అంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి.

Comments are closed.