అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కుకు మూడినట్లే?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం బలిపీఠం మీద ఉంది అని కార్మిక సంఘాలు ప్రగాఢంగా నమ్ముతున్నాయి. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఉదాశీన వైఖరిని చూసి వారు మండిపడుతున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం…

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం బలిపీఠం మీద ఉంది అని కార్మిక సంఘాలు ప్రగాఢంగా నమ్ముతున్నాయి. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఉదాశీన వైఖరిని చూసి వారు మండిపడుతున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోమని ఒక్క ప్రకటన ఇస్తే చాలు అదే పదివేలు అని అంటున్న కార్మిక సంఘాలకు నాలుగేళుగా ఆ మాట వినే భాగ్యం అయితే దక్కడం లేదు

విశాఖ ఉక్కుని లాభాల బాటను పట్టించాలంటే మొత్తం ఉన్న బ్లాక్ ఫర్నెస్ విభాగాలు అన్నీ పూర్తి సామర్ధ్యంతో పనిచేయాలి. ఉద్యోగులు కార్మికులు పూర్తిగా ఉండాలి. పదవీ విరమణ చేసిన వారి ప్లేస్ లో కొత్త వారి నియామకం జరగాలి. విశాఖ ఉక్కుకు సొంత నిధులు కావాలి. ఆర్ధికంగా కేంద్రం చేయూతను ఇవ్వాలి

అయితే జరుగుతున్నది రివర్స్ లో ఉంది. దాంతో విశాఖ ఉక్కు దక్కే సూచనలు లేవనే డౌట్ లో కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇంతలో పిడుగుపాటులా మరో వార్త వచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి ఆర్సెలాల్ మిట్టల్, నిప్పన్ ఆసక్తిగా ఉన్నాయన్నది ఆ వార్త.

దీని కోసం తొలి దశలోనే 70 వేల కోట్లు వెచ్చిస్తారని ఏపీ ప్రభుత్వం వద్ద వారు ప్రతిపాదనలు ఉంచారని తెలుస్తోంది. ప్లాంట్ నిర్మాణం కోసం రెండు వేల ఎకరాలు అవసరం అవుతాయని ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 20 వేల మందికి ఉపాధిని అందిస్తామన్నది మిట్టల్ నిప్పన్ నుంచి ప్రభుత్వం ముందుంచిన హామీలు.

దీంతో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ కి భూమిని కేటాయిస్తూ ఇతర రాయితీలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే అక్కడ మంచిదే కానీ ప్రభుత్వ రంగంలోకి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద దాని ప్రభావం పడుతుందని దానిని తెచ్చి దీనిని ప్రైవేట్ పరం చేయడానికేనా ఈ ప్రతిపాదనలూ అంటూ కార్మిక సంఘాలలో పెద్ద అనుమానాలే కలుగుతున్నాయట.

దీని మీద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి విశాఖలో నిర్వహించిన ఒక రౌండ్ టేబిల్ సమావేశంలో మాట్లాడుతూ అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని తెర మీదకు తేవడం వెనక దురుద్దేశ్యాలు ఉన్నాయని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని తాము పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.

14 Replies to “అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కుకు మూడినట్లే?”

  1. మీ జగన్ లా KCR కు బయపడి హైదరబాద్ లొ వున్న తన అస్తులను కాపడుకొవడానికి ..

    అమరావతిని .పొలవరాన్ని కొల్డ్ స్టొరెజ్ లొ పెట్టిన్ నితిమాలిన ముండాకొడుకు అ జగన్ గాడు

    1. కొంప కట్టుకున్న ప్రాంతాన్నే స్మశానం చెయ్యాలనుకున్న దరిద్రుడు అని మీ ఉద్దేశమా..;)

  2. తల్లి , చెల్లి బహిరంగ లేఖ తర్వాతైనా ఆస్తి ఇచ్చేది ఉందా లేదా ? మహా మేత ఆజ్ఞ ఆ డివిడెండ్ పేద ప్రజలకి ఓదార్పు యాత్రలో చెందవలసినవి అవి కూడా కాజేసాడు నీచుడు జగన్ రెడ్డి

  3. ఇది మన అన్న విశాఖ రాజధాని అంటే స్టీల్ ప్లాంట్ మూడినట్టే అనే వార్త లాగనా?

  4. Governments in AP are never positive towards core sector. Once upon a time north andhra districts used to be favorable towards ferro alloy sector but government attitude towards the sector and the real estate bias completly killed the sector. The government and people of AP so crazy that they destroys crores factory involved in core sectors for converting into real estate ventures/services sector. Quigmare, power price in AP in inconsistent and costly, as well as raw materials like cokking coal, limestone, dolomite, iron ore etc. are not available in AP and no state permits exporting of raw materials instead of operating a plant in that state. Only fools like YSR can do that type of things which are rather meant for garnering illegal money. Even unionization in AP killed many ferroalloy units like Jindal ferro alloys in Kottavalasa and respective governments from time to time allowed moving out of minerals like manganese, laterite, aluminum,etc. From AP for their gains. Last but not least even governments are charging heavily on the power supply to industry particularly core sector particularly steel and ferro alloys which require cheaper power consistently and further it is quite skeptical whether governments are in a position ensure consistent power supply since governments as a populist measure diverted the power supply meant for industry to household sector and charging heavily on industry. The new proposal is just a mockery aimed at transferring benefits to industralist for getting illegal money whereas operating RINL in these circumstances is just a gamble on tax payers money. Moreover sections like employees, unions,vendor’s as well as governments in AP from time to time including TDP Government completly exploited RINL. Until TDP and YSRCP thrown out from AP better not to operate any of such industry in AP.

  5. ఉన్న స్టీల్ ప్లాంట్ ని పునరుద్దించలేరు కాని, కొత్త స్టీల్ ప్లాంట్ కి పర్మిషన్ ఇస్తున్నారు. మీరు చేయలేకపోతే వాళ్ళు ఎలా చేయగలరు ?గవర్నమెంట్ దృష్టి సారించాలి..…

  6. ప్రజలు కట్టిన పన్నులు డబ్బు వీళ్ళు చేసే నిర్వాహకానికి ఇవ్వాలి ప్రభుత్వం లో అయితేనే చేస్తారు ప్రైవేట్ కి ఇస్తే ఆడుకు దొబ్బటానికి కుదరదు కచ్చితంగా ప్రైవేట్ కి అప్పచెప్పాలి అవసరమైన మేరకే ఫ్యాక్టరీ కి భూములు ఇచ్చి మిగిలిన భూములు ప్రభుత్వం అమ్మి వచ్చిన దానితో నూతన ఉపాధి కల్పించాలి

  7. tax payers money tho steel plant nadupudu endi ra bhai. tvaragaa ammeyandi. private factories vasthe automatic gaa udhyogaalu perugutai. ee union mattala kosam government nashtaalu bharistoo plant nadapanavasaram ledu.

Comments are closed.