ఈ వివాదాలు ఇక సద్దుమణిగినట్టేనా?

ఈమధ్య కాలంలో టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపిన వివాదాలు మూడున్నాయి. వాటిలో ఒకటి రాజ్ తరుణ్, లావణ్య వివాదం. హీరో రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని,…

ఈమధ్య కాలంలో టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపిన వివాదాలు మూడున్నాయి. వాటిలో ఒకటి రాజ్ తరుణ్, లావణ్య వివాదం. హీరో రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని, గర్భం చేసి, అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది లావణ్య అనే అమ్మాయి.

దీనిపై ఇద్దరూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇంకా కోర్టు పరిథిలోనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా కథనాలు వచ్చాయి. చివరికి రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా ఈ వివాదంపై తనదైన శైలిలో విశ్లేషణలు ఇచ్చాడు. అంతలోనే సడెన్ గా అన్నీ ఆగిపోయాయి. రాజ్ తరుణ్ సినిమాలతో బిజీ అయిపోగా, లావణ్య మీడియా ముందుకు రావడం మానేసింది.

జానీ మాస్టర్ కేసు కూడా దాదాపు ఇలాంటిదే. జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అతడిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించడంతో పాటు.. అత్యాచారం చేసిన టైమ్ లో తను మైనర్ నని ఆమె పేర్కొనడం పెద్ద వివాదానికి దారితీసింది.

దీంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారు. ఎట్టకేలకు బెయిల్ పై బయటకొచ్చాడు జానీ మాస్టర్. అతడికిలా బెయిల్ దొరికిందో లేదో అలా ఈ వివాదం సైడ్ ట్రాక్ పట్టింది. తెరవెనక ఈ మేటర్ సెటిల్ అయినట్టు చెబుతున్నారు చాలామంది.

ఇక హేమ డ్రగ్స్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. బెంగళూరు పోలీసులు, హేమ మధ్య పెద్ద ప్రహసనమే నడిచింది. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. హైదరాబాద్ వచ్చి మరీ ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైళ్లో పెట్టారు.

బెయిల్ పై బయటకొచ్చిన హేమ తను డ్రగ్స్ తీసుకోలేదన్నారు. ఇదే టైమ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై తాత్కాలికంగా నిషేధం విధించడం, ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాన్ ఎత్తేయడం చకచకా జరిగిపోయాయి. ఒక దశలో మీడియా తనకు డ్రగ్స్ పరీక్షలు చేయించాలంటూ హేమ ప్రకటించడం విశేషం. మొత్తానికి ఆ వివాదం కూడా మెల్లమెల్లగా పక్కకెళ్లిపోయింది.

ఇలా టాలీవుడ్ కు చెందిన 3 కీలకమైన కేసులు ప్రస్తుతానికైతే సద్దుమణిగాయి. మెగాభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ మధ్య చెలరేగిన సోషల్ మీడియా ఘర్షణలు కూడా కొన్నాళ్లు సద్దుమణిగినప్పటికీ, తాజాగా వరుణ్ తేజ్ వ్యాఖ్యలతో కాక మళ్లీ రాజుకుంది.

5 Replies to “ఈ వివాదాలు ఇక సద్దుమణిగినట్టేనా?”

Comments are closed.