ఆల్రెడీ టాలీవుడ్ లో ‘ఫ్యాక్టరీ’ మోడల్ ఉంది. తక్కువ టైమ్ లో వంద సినిమాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో వచ్చిన టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే 50 సినిమాలకు దగ్గరగా వచ్చేశారు. ఈ క్రమంలో ఆయన హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా చూశారు. డబ్బులు పోయినా పర్వాలేదు, నా టార్గెట్ ముఖ్యం అన్నట్టుంది ఆయన వ్యవహార శైలి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మాత కథలు వినరు. ఓ టీమ్ ఉంటుంది, వాళ్లు కథలు వడపోస్తారు. ఫైనల్ గా విశ్వప్రసాద్ టేబుల్ మీదకు ప్రాజెక్టు వెళ్తుంది. బడ్జెట్ లెక్కలు చూసుకొని ఆయన ఓకే చెబుతారు. మొన్నటికిమొన్న కూడా ఓ ఇంటర్వ్యూలో తను కథలు వినాల్సిన అవసరం లేదని తనకుతానుగా ప్రకటించుకున్నారు విశ్వప్రసాద్. డిజాస్టర్ అయిన మిస్టర్ బచ్చన్ విషయంలో కూడా “రీమేక్ ఎందుకు, స్ట్రయిట్ కథతో సినిమా చేస్తే బెటర్ కదా” అనే ఆలోచన ఆయనకు ముహూర్తానికి ముందురోజు వచ్చిందంటే, ప్రీ-ప్రొడక్షన్ లో ఆయన చొరవ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడీ మోడల్ లోకి దిల్ రాజు అడుగుపెట్టడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. దిల్ రాజు డ్రీమ్స్ అనే కంపెనీ/వెబ్ సైట్ పెడుతున్నారీయన. ఎవరైనా కథలు పట్టుకొని వీళ్లను సంప్రదించొచ్చు. ఇక్కడున్న ఓ టీమ్ కథలు వడబోస్తుంది. ఫైనల్ గా కొన్నింటిని దిల్ రాజు వద్దకు తీసుకెళ్తుంది.
వారానికి ఒక రోజు కేటాయించి కథలు విని ఓకే చేస్తారు దిల్ రాజు. అంటే.. తన టీమ్ తీసుకొచ్చిన కథలు మాత్రమే ఈయన వింటారన్నమాట. మరి మిగతా కథల్లో మంచి లైన్స్ ఉంటే వాటి సంగతేంటి?
ఔత్సాహిక నిర్మాతలకు మంచి ప్రాజెక్టులు, టీమ్ సెట్ చేసి ఇవ్వడానికి ఈ వేదికను ఏర్పాటుచేసినట్టుగా చెప్పుకున్నారు దిల్ రాజు. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ లో కూడా సహకారం ఉంటుందనేది ఆయన మాట. అది మంచి పనే. తనవరకు తాను లైజనింగ్ చేసుకోవచ్చు, రిస్క్ కూడా తక్కువ. కానీ 360 డిగ్రీల కోణంలో ఈ వేదిక పనిచేస్తుందన్నప్పుడే కొన్ని కోణాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
టాలెంట్ ను ఒడిసిపట్టుకోవడానికి ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనేది మంచి ఎత్తుగడ. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చి ఈ ప్రాసెస్ ను కొనసాగించడానికి ఎంపిక చేసుకునే టీమ్ పెర్ ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే, దిల్ రాజు కలలు నెరవేరాలంటే 90 శాతం ఈ కిందిస్థాయి ఉద్యోగుల చేతుల్లోనే ఉంటుంది.
ఆ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడు ఆయన ‘డ్రీమ్’ సూపర్ హిట్టవుతుంది. లేదంటే, మరో ‘ఫ్యాక్టరీ’ తయారవుతుంది. అయితే ఇక్కడ దిల్ రాజు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు. ఎంత ప్రాసెస్ చేసి తీసినా ఏడాదికి 5 సినిమాలు మాత్రమే అనేది ఈయన లిమిట్. ఇక్కడే ఫ్యాక్టరీ మోడల్ కు డ్రీమ్ కు తేడా తెలుస్తోంది.
vc available 9380537747
vc estanu 9380537747
కథ సరే..రచయితకు నచ్చలేదని స్టోరీ లైన్ లేదా కొన్ని సీన్లు కాపీ కొట్టరని గ్యారంటీ ఏముంది? అప్పుడు కాపీ రైట్ గొడవలు తలెత్తవా?
Call boy jobs available 9989793850
అన్నీ డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేయండి