కంగువ – బిగుసుకున్న వివాదం

నైజాంలో పవర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ కు, ఇప్పుడిప్పుడే గట్టి పోటీదారుగా తయారవుతున్న మైత్రీ మూవీస్ కు మధ్య వివాదం పూర్తిగా బిగుసుకుంది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. Advertisement ఇటు మైత్రీ…

నైజాంలో పవర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ కు, ఇప్పుడిప్పుడే గట్టి పోటీదారుగా తయారవుతున్న మైత్రీ మూవీస్ కు మధ్య వివాదం పూర్తిగా బిగుసుకుంది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.

ఇటు మైత్రీ సంస్థ శశి, అటు ఆసియన్ సునీల్ ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. రాజీకి రావడం లేదు. వాళ్లు అడిగినన్ని థియేటర్లలో తాము సినిమా ఎలా వేస్తామని మైత్రీ శశి, మిగిలిన వారికి సినిమా ఇచ్చి, తమ దగ్గరకు వచ్చేసరికి రూల్స్ మాట్లాడుతున్నారని ఆసియన్ సునీల్ బిగుసుకుని కూర్చున్నారు.

నిజానికి ఇరువురు కూర్చుని మాట్లాడుకుంటే ఇట్టే సెటిల్ అయిపోయే విషయం. ఈయన్నా కాస్త తగ్గితే.. లేదా అటు వైపు అన్నా కాస్త బేరం ఆడుకుంటే సరిపోతుంది. కానీ ఇరు వైపులా చూసుకుందాం, ప్రతాపం అన్నట్లు వుంది పరిస్థితి.

ముఖ్యంగా మూసాపేట లక్ష్మీకళ.. శశికళ దగ్గర వచ్చింది సమస్య. బాలానగర్ విమల్ థియేటర్ ను మైత్రీ సంస్థ తీసుకోవడంతో వాళ్లకు లక్ష్మీకళ కాంప్లెక్స్ మీద అంత అవసరం లేకపోయింది. అటు గోకుల్ వుండనే వుంది. పైగా లక్ష్మీకళ కాంప్లెక్స్ కు ఇస్తే రెంటల్ మీద కాకుండా షేరింగ్ మీద ఇవ్వాలనేది మైత్రీకి నచ్చడం లేదు. కానీ అలా షేరింగ్ మీద ఇవ్వడం ద్వారా నాలుగైదు వారాలు సినిమా ఆడిస్తున్నామని, మొత్తం మీద చూసుకోకుండా, జస్ట్ ఒక వారం చూసుకుని అపోహ పడుతున్నారని అసియన్ సంస్థ వాదన.

చిరకాలంగా నైజాంలో కేవలం ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు కమ్ ఎగ్జిబిటర్లు వుంటూ వస్తున్నారు. అది ఇఫ్పుడు ముక్కోణపు పోటీగా మారింది. దాంతో అధిపత్య పోరు మొదలైంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో. ఇప్పుడు ఆసియన్ సినిమాస్ కు సినిమా ఇవ్వకపోవడం లేదా వేయకపోవడం వల్ల కీలకమైన నైజాంలో అందులోనూ హైదరాబాద్ సిటీలో కంగువ సినిమా బుకింగ్ లు కనిపించని పరిస్థితి నెలకొంది.

7 Replies to “కంగువ – బిగుసుకున్న వివాదం”

Comments are closed.