డిప్యూటీ స్పీక‌ర్‌పై జ్యోతుల నెహ్రూ అస‌హ‌నం

శాస‌న‌స‌భ స‌మావేశాల్లో భాగంగా స్పీక‌ర్ స్థానంలో కూచున్న డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై టీడీపీ స‌భ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

శాస‌న‌స‌భ స‌మావేశాల్లో భాగంగా స్పీక‌ర్ స్థానంలో కూచున్న డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై టీడీపీ స‌భ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. జ్యోతుల నెహ్రూ ప్ర‌సంగాన్ని అడ్డుకోవ‌డంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెందారు. మాట్లాడ‌కుండా కూచోమంటే, అదే ప‌ని చేస్తాన‌ని జ్యోతుల నెహ్రూ అన్నారు. అసెంబ్లీకి రావ‌ద్దంటే రాన‌ని జ్యోతుల నెహ్రూ కాస్త క‌ఠినంగా మాట్లాడారు.

క‌నీసం ఐదు నిమిషాలు కూడా మాట్లాడ‌నివ్వ‌క‌పోతే ఎలా అని జ్యోతుల నెహ్రూ ప్ర‌శ్నించారు. డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ స్పందిస్తూ, మాట్లాడొద్ద‌ని తాను చెప్పడం లేద‌ని, త్వ‌ర‌గా ముగించాల‌ని మాత్ర‌మే తాను కోరుకుంటున్న‌ట్టుగా చెప్పారు. దీంతో నెహ్రూ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.

ఇసుక పాలసీ ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెస్తోంద‌ని జ్యోతుల నెహ్రూ తెలిపారు. పాత విధాన‌మే బాగుంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం ఆలోచించాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి ర‌ఘురామ బెల్ కొట్టి, ప్ర‌సంగాన్ని ఆపాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. స‌భ్యులు అస‌హ‌నంగా ఉన్నార‌ని, ఇంకా చాలా మంది మాట్లాడాల్సి వుంద‌ని ర‌ఘురామ అన్నారు.

మీరంటే చాలా గౌర‌వం వుంద‌ని, అయిన‌ప్ప‌టికీ కొత్త స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాలి క‌దా అని ర‌ఘురామ అస‌హ‌నంతో అన్నారు. జ్యోతుల నెహ్రూ మైక్ క‌ట్ చేశారు. క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డికి మాట్లాడే అవ‌కాశాన్ని డిప్యూటీ స్పీక‌ర్ క‌ల్పించారు.

6 Replies to “డిప్యూటీ స్పీక‌ర్‌పై జ్యోతుల నెహ్రూ అస‌హ‌నం”

  1. ప్రతిపక్షం భయపడి ఇంట్లో కూర్చుంటే అధికారపక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిష్టుంది అని కూడా రాయొచ్చు ఎంకటి..

    .

    పెన్ను లో సిరా మార్చు..ఎప్పడు బులుగు సిరాయేనా..

  2. ఏది విధ్వంసం.. ?

    క్రిందితేడాది… ఈ టైం కి ఈ స్కూల్ కి ఎన్ని టాబ్స్ పంపించాలి.. అని డిస్కషన్ .. వాటిని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చెయ్యడం కోసం డిస్కషన్..

    ఇప్పుడు.. ? మందు అందుబాటులో ఉంచాలి .. అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి అని డిస్కషన్…..

    ఏది విధ్వంసం?

    1. షేర్ హోల్డర్ లని మోసం చేసిన భైజు కంపనీ టేబ్లెట్స్ నే కదా, రజనీకాంత్ వేటాయన్ సినిమా కూడా ఇదే స్టోరీ.

      ప్యాలస్ పులకేశి గాడు గోడౌన్ లో వున్నాయి అవి అన్ని

Comments are closed.