డీఎస్పీ నిర్వ‌హ‌ణ‌కు లోకేశ్ తాజా ప్ర‌క‌ట‌న‌

మెగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు అభ్య‌ర్థుల్లో గంద‌ర‌గోళం నెల‌కుంది. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులున్నాయ‌ని, వాటిపై లోతైన అధ్య‌య‌నం త‌ర్వాతే డీఎస్సీ నిర్వ‌హ‌ణ వుంటుంద‌ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కోర్టులో వ్య‌వ‌హారం…

మెగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు అభ్య‌ర్థుల్లో గంద‌ర‌గోళం నెల‌కుంది. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులున్నాయ‌ని, వాటిపై లోతైన అధ్య‌య‌నం త‌ర్వాతే డీఎస్సీ నిర్వ‌హ‌ణ వుంటుంద‌ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కోర్టులో వ్య‌వ‌హారం అంటే ఇప్ప‌ట్లో తెగేది కాద‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందుకే డీఎస్సీ అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇవాళ మ‌రోసారి డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై విద్యాశాఖ మంత్రి లోకేశ్ మ‌రోసారి కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ స‌మ‌యానికి డీఎస్సీ ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని లోకేశ్ ప్ర‌క‌టించారు. న్యాయ ప‌రంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ స‌మ‌యానికి అంటే… జూన్ నాటికి డీఎస్సీ నియామ‌కాలు పూర్తి చేస్తామ‌ని లోకేశ్ చెప్పిన‌ట్టైంది. లోకేశ్ చెప్పే ప్ర‌కారం ఏడు నెల‌ల్లో నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం, ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, ఫ‌లితాలు వెల్ల‌డించ‌డం, ఇంట‌ర్వ్యూలు పూర్తి చేయ‌డం, అలాగే నియామ‌కాల్ని కూడా చేప‌ట్ట‌డం పూర్తి చేస్తామ‌నే సంకేతాల్ని లోకేశ్ ఇచ్చిన‌ట్టైంది.

లోకేశ్ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటే డీఎస్సీ అభ్య‌ర్థుల అభినంద‌న‌లు అందుకుంటారు. అయితే ఆ ప‌రిస్థితి వుందా? అనేదే అభ్య‌ర్థుల నుంచి అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే కోర్టులో న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌కు ప‌రిష్కారం ల‌భించాలంటే ఎంత స‌మ‌యం తీసుకుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల్ని త్వ‌ర‌గా ప‌రిష్క‌రించి డీఎస్సీని నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం వుంది.

16 Replies to “డీఎస్పీ నిర్వ‌హ‌ణ‌కు లోకేశ్ తాజా ప్ర‌క‌ట‌న‌”

  1. అలా అసెంబ్లీ లో ప్రకటన చేయగానే .. ఇలా డీఎస్సీ అభర్డులు నీకు అనుమానాలు వ్యక్త పరిచేశారు.. అబ్బా అబ్బా .. ఏమి రస్తావు స్వామి నువ్వు

  2. న్యాయపరమైన చిక్కులు ‘రేపే’ పూర్తి చేసి ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం..

  3. అభ్యర్థుల అనుమానాలు తర్వాత చూడొచ్చు కానీ, ముందు నీ టైటిల్ చూడు డీఎస్సీ కి డి.ఎస్.పి కి తేడా తెలియని సంకరజాతి నాయాలా

  4. ఏది విధ్వంసం.. ?

    క్రిందితేడాది… ఈ టైం కి ఈ స్కూల్ కి ఎన్ని టాబ్స్ పంపించాలి.. అని డిస్కషన్ .. వాటిని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చెయ్యడం కోసం డిస్కషన్..

    ఇప్పుడు.. ? మందు అందుబాటులో ఉంచాలి .. అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి అని డిస్కషన్…..

    ఏది విధ్వంసం?

    1. ఆ ట్యాబులు ఇపుడు ఏమయ్యాయి అందా, బైజుస్ ఎక్కడుంది? నీకు మందు మీద నుంచి దృష్టి మల్లటం లేదు అనిపిస్తుంది వెళ్లి మీ దద్దమ్మ గాన్ని అడుగు నిషేధం ఎందుకు చేయలేక పోయావు అని. పనిలో పనిగా 5 ఇయర్స్ లో మందు మీద ఎంత సంపాదన వచ్చిందో అడుగు.

        1. ఏదైనా కొత్త విధానం మొదలు పెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి అది ఎంతవరకు ఉపయోగం అని. ప్రైవేట్ స్కూల్స్ లో ఒకటవ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ అంటూ మోసం చేస్తున్నట్టు ఈ దద్దమ్మ గాడు కూడా టోఫెల్ అని ఇంటర్నేషనల్ సిలబస్ అని బైజస్ అని ఏదేదో హంగామా చేశాడు, ఏదైనా శాస్త్రీయంగా మేధావులతో ఆలోచించి చేయాలి కానీ ఫాన్సీ గా ఉంటుంది అని ఏది అనిపిస్తే అది చేయటం కాదు

Comments are closed.