తగ్గిన పారితోషికం.. సూర్య ఎందుకిలా చేశాడు?

ఆశ్చర్యకరంగా సూర్య, తన గత సినిమాల కంటే, కంగువా కోసం తక్కువ చార్జ్ చేశాడు

సూర్య హీరోగా నటించిన సినిమా కంగువా. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం సూర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు..? కల్కి లాంటి సక్సెస్ తర్వాత దిశా పటానీ ఈ సినిమా కోసం ఛార్జ్ చేసిన మొత్తం ఎంత? ఇప్పుడీ వివరాలన్నీ బయటకొచ్చాయి

ఆశ్చర్యకరంగా సూర్య, తన గత సినిమాల కంటే, కంగువా కోసం తక్కువ చార్జ్ చేశాడు. గతంలో చేసిన ఈటీ సినిమాకు అటుఇటుగా 50 కోట్లు తీసుకున్న ఈ హీరో, కంగువా కోసం మాత్రం 39 కోట్ల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట.

అంటే.. గడిచిన మూడేళ్లలో సూర్య తన పారితోషికాన్ని 22 శాతం తగ్గించుకున్నట్టయింది. దీనికి పలు కారణాలున్నాయి. ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు సూర్య. ఇదొక కారణమైతే, గడిచిన కొన్నేళ్లుగా అతడి మార్కెట్ తగ్గింది, వరుసగా 2 సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈటీ సినిమా కూడా బాక్సాఫీస్ బద్దలయ్యేంత హిట్ కాదు. ఈ కారణాల వల్ల అతడి పారితోషికం తగ్గింది.

అదే టైమ్ లో దిశా పటానీ 50 శాతం ఎక్కువ పారితోషికం తీసుకుంది. దీనికి కారణం కల్కి సినిమా సక్సెస్. కంగువాకు దిశా పటానీకి అందిన మొత్తం 3 కోట్ల రూపాయలంట. కల్కి సినిమా కోసం తీసుకున్న ఎమౌంట్ కంటే ఇది రెట్టింపు అని చెబుతున్నారు.

అటు విలన్ గా నటించిన బాబీ డియోల్ కూడా మంచి ఎమౌంట్ అందుకున్నాడు. యానిమల్ సక్సెస్ తో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చిన ఈ నటుడు, కంగువా కోసం 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.

ఓవరాల్ గా చూసుకుంటే.. కంగువా బడ్జెట్ లో వీళ్ల ముగ్గురి పారితోషికాల వాటా 16 శాతం. సూర్య తన పారితోషికం తగ్గించుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. బడ్జెట్ లో ఎక్కువ భాగం గ్రాఫిక్స్, సెట్స్ కు ఖర్చు చేశారు.

10 Replies to “తగ్గిన పారితోషికం.. సూర్య ఎందుకిలా చేశాడు?”

  1. అసలు అంత ఎక్కువ పారితోషికం ఎందుకు ? 39 కోట్లు తెలుపు , ఇది కాక నల్ల ధనం ఇంకో 40 కోట్లు పైనే ఉంటది అవన్నీ పన్నులు ఎగ్గొట్టడానికి జిత్తులు ,వీడు జగన్ రెడ్డి బినామీ

Comments are closed.