హీరో ధనుష్, హీరోయిన్ నయనతారకు మధ్య పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరూ గొడవ పడినట్టు పెద్దగా కథనాలు రాలేదు. అయితే ఇద్దరి మధ్య గతంలో పెద్ద గొడవలే జరిగినట్టున్నాయి. తాజాగా నయనతార రిలీజ్ చేసిన ఓ బహిరంగ లేఖ.. వీళ్ల మధ్య గొడవల్ని బయటపెట్టింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. నయనతారపై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీసింది. ఎల్లుండి అది స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీనికి సంబంధించి ట్రయిలర్ వదిలారు. ఇందులో “నేనూ రౌడీనే” అనే సినిమాకు సంబంధించి కొన్ని క్లిప్స్ వాడారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ సినిమా నిర్మాత ధనుష్ లీగల్ నోటీసు పంపించాడు. ట్రయిలర్ లో 3 సెకెన్ల క్లిప్ వాడారు కాబట్టి 10 కోట్లు చెల్లించాలనేది అతడి డిమాండ్. దీనిపై నయనతార భగ్గుమంది.
“నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి సంబంధించి రిలీజ్ చేసిన ట్రయిలర్ లో 3 సెకెన్ల క్లిప్ వాడినందుకు లీగల్ నోటీసు పంపించావు. అవి కూడా మేం మా మొబైల్ ఫోన్లతో తీసినవి, మరికొన్ని ఆన్ లొకేషన్ షాట్స్. ఇప్పటికే చాలా పబ్లిక్ ఫ్లాట్ ఫామ్స్ లో ఉన్న ఆ 3 సెకెన్ల సన్నివేశాలను వాడినందుకు మాపై 10 కోట్ల రూపాయలకు లీగల్ నోటీసు పంపించావు. నువ్వు ఎంత దిగజారిపోయావో, నీ వ్యక్తిత్వం ఏంటో దీన్ని బట్టి అర్థం అవుతోంది.”
గతంలో జరిగిన పాత గొడవల్ని మనసులో పెట్టుకొని ధనుష్ ఇలా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తోంది నయనతార. అప్పటికీ ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం చాలా ప్రయత్నించి విసిగిపోయామని బహిరంగ లేఖలో తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసింది.
“మా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి మీ నుంచి ఎన్ఓసీ కావాలి. దాని కోసం రెండేళ్లు ఎదురుచూశాం. చివరికి ఆశలు వదిలేసుకున్నాం. ‘నేనూ రౌడీనే’ సినిమా నుంచి విజువల్ లేదా సాంగ్స్ వాడుకోవడం మీకు ఇష్టం లేదని తెలిసి డాక్యుమెంటరీని రీ-ఎడిట్ చేశాం. ఎన్నో వినతుల తర్వాత అతికొద్ది స్టిల్స్ మాత్రమే వాడుకున్నాం. ఈ విషయంలో మీ ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార అవసరాలు ఉంటే అర్థం చేసుకునేవాళ్లం. కానీ కేవలం నన్ను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశం, వ్యక్తిగత ద్వేషంతో మాత్రమే ఇన్నేళ్లు తిప్పించుకున్నారు.”
‘నేనూ రౌడీనే’ సినిమా విడుదలకు ముందు ధనుష్ చేసిన గాయాల్ని ఇంకా మరిచిపోలేదని ఆరోపించింది నయనతార. ఆ గాయాలు ఎప్పటికీ మానవని, సినిమా రిలీజై, పెద్ద హిట్టయిన తర్వాత ధనుష్ ఇగో ఎంత హర్ట్ అయిందో మీడియా ద్వారా తెలుసుకున్నానని రాసుకొచ్చింది.
లీగల్ నోటీసు అందుకుంటున్నానని, లీగల్ గానే పోరాటం చేస్తానని ప్రకటించింది. కాపీరైట్ చట్టం ప్రకారం కోర్టులో ధనుష్ కు వాదించడానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ, నైతికంగా చూసుకుంటే, దేవుడి కోర్టు ముందు ధనుష్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటోంది.
మొత్తానికి ఈ ఒక్క బహిరంగ లేఖతో పదేళ్ల కిందట ధనుష్-నయనతార మధ్య గట్టిగానే ఏదో జరిగిందనే విషయం కన్ ఫర్మ్ అయింది. వాటిలో కొన్నింటిని నయనతార లేఖలో ప్రస్తావించింది. మిగతా విషయాలు కూడా లీకుల రూపంలో బయటకొచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే, కోలీవుడ్ అంటేనే లీకులకు అడ్డా కదా.
kg mamsam kuda leni bakka dhanush ki andaru heroines tho contravarsy le pellaniki vidakulichadu veedu
Idhi emaina patthithu entra…Simbu ni nela nakinchesindi, already pelli ayina prabu Deva tho love track nadipi valla wife ki divorce ippinchi appatidaka rising lo vunna vadi career ni nasanam chesindi,best actress award AA istunte naku Na lover iste baguntundi ani avamaninchindi…vadu legal ga notice icchadu vadu produce chesina movie kabatti… indhulo vadi tappenti? Bajar danila behave chestundi…daniki neelanti Galla support…have any shame?
అతను లీగల్ గా నోటీస్ పంపించాడు, నువ్వు కూడా లీగల్ గానే సమధానం ఇవ్వాల్సి ఉంది. పబ్లిక్ ముందు ఇలా ఓపెన్ అయ్యింది అంటే ఆ సిరీస్ పబ్లిసిటీ కోసం అంతే. ప్రభుదేవా తో బ్రేకప్ అప్పుడు కూడా ఇలానే వీధికెక్కింది. అతను హుందాగానే సైలెంట్ గా ఉన్నాడు.
కొందరు కర్టెసి లెని లం,,,,,జ లు ఎమి చెస్తారొ తెలుసా..ఎవరైనా అవార్డ్ ఇస్తూ వుంటె..ఇతనొద్దు ..నా ప్రియుడి చెతుల తొ బహుమతి తీసుకుంటా అని స్టెజ్ మీదె అంటె..అ ఇవ్వటానికి వచ్చిన వ్యక్తి కి ఎంత అవమానం వుంటుందొ తెలుసా..కొందరు లం….జలకు కన్ను మిన్ను కానరావు
vc estanu 9380537747
ఆయన కు రైట్స్ ఉన్నాయి.. నోటీస్ పంపించాడు.. ఆ సినిమా లో నటించినందుకు రెమ్యూనరేషన్ ఇచ్చాడు.. ఇంకేటి కన్సర్న్? మహామహులు బాలు, ఇళయరాజా మధ్యనే రైట్స్ గురించి విబేధాలు వచ్చాయి..
Follow the process.. Process will save you
నయనతార గోడవలమారి
Eemeku comedy radu
Emotions antha bagovu
Goppa dancer kadu
Single expressions all movies…..!
Malayali lu koncham thedaa…
Ee boku Munda vaalla own production ayithe movie promotion chestundi kaani vere producers aithe cheyanu naaku sentiment antundi… Edo evaru Gathi leka deeni bokkalo acting ki idi lady super star ….