ఉన్నత విద్య పేరుతో ఎమ్మెస్ చేస్తామంటూ అమెరికా, కెనడా, యుకె, ఆస్ట్రేలియా యిత్యాది దేశాలకు వెళ్లేవారికి ఉపయోగపడే వ్యాసం కాదిది. అలా వెళ్లేవారిలో అధికాంశం వెళ్లేది ఆర్జన కోసమేననీ, చదువు మీద శ్రద్ధతో కాదనీ మనకే కాదు, ఆ దేశాల్లో ఉత్తుత్తి యూనివర్శిటీలు నడిపే వారికీ, వాళ్లు ఏజంట్లుగా పెట్టుకున్న యిక్కడి కన్సల్టెంట్లకు అందరికీ తెలుసు. అందుకే వారంలో పది గంటలైనా యూనివర్శిటీకి రాకపోయినా, గడువు పూర్తి కాగానే పట్టా చేతిలో పెడతారు. అది చూపించి, యింకో ఏడాది పాటు ఆ దేశంలో తిష్ట వేసి, ఏదో రకంగా డాలర్ల చెట్టు ఆకులు తెంపుకుని వద్దామని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల లెక్క.
ఈ విద్యావ్యాపారం వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కదాని ఆ యా దేశాల వారు యీ పుట్టగొడుగులను ఎదగనిచ్చారు. తత్ఫలితంగా అక్కడ విద్యావంతులు, మేధావులు పెరగకపోగా, చౌక కార్మికులు యిబ్బడిముబ్బడిగా లభ్యం కాసాగారు. దానికి వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబీకులు ఆనందించినా, ఉద్యోగావకాశాలు తగ్గిన స్థానికులు చిర్రుబుర్రు లాడసాగారు. ట్రంప్ విజయానికి దోహదపడిన కారణాల్లో యిదీ ఒకటి అంటున్నారు.
‘చిల్లర పనులు చేయవలసిన అవసరం పడని డబ్బున్న కుటుంబాల పిల్లలు, మన దేశంలో ఉత్తమ యూనివర్శిటీల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులై, అచ్చంగా చదువు కోసమే వచ్చే మేధావులూ తప్ప, అత్తెసరు మార్కుల వారు, అప్పు చేసి రావలసిన పరిస్థితిలో ఉన్న మధ్య తరగతి వారు యిక్కడకు రాకపోవడమే మంచిది. ఇక్కడి పరిస్థితి బాగా లేదు. ఎప్పుడు మెరుగవుతుందో తెలియదు. వస్తే నిరాశకు గురవుతారు.’ అని అక్కడున్న మన తెలుగు ప్రముఖులు హితోక్తులు చెపుతూ వీడియోలు చేసి యూట్యూబుల్లో పెడుతున్నారు. అయినా ఆశావహులు అదృష్టాన్ని నమ్ముకుని, దేవుణ్ని, ఏజంటుని నమ్ముకుని విమానమెక్కుతూనే ఉన్నారు.
అందువలన శంఖాలూదే పని నేను పెట్టుకోలేదు. విదేశాలలో బోధించే నిజమైన ఉన్నత విద్య గురించిన వ్యాసమిది. అక్కడి గొప్ప యూనివర్శిటీలను చూసి, నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలు. నేను స్వయంగా 1982 లో పశ్చిమ జర్మనీలోని బొబ్లింజెన్ యూనివర్శిటీలో కంప్యూటరు సైన్సెస్‌లో పిజి డిప్లొమా చేశాను. దానికి ముందు కాకినాడలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు చేశాను.అందువలన నాకు విద్యావిధానాలపై కొంత అవగాహన ఉంది.
2006 మేలో ఎచ్‌ఎమ్ టివి వారు ‘కమాన్ ఇండియా’ అనే కార్యక్రమంలో భాగంగా ఉన్నత విద్య ఎలా ఉండాలి, పరిశ్రమల స్థాపనకు ఉన్నత విద్యార్జన ఏ విధంగా దోహదపడుతుంది, ఆనాడు విపరీతంగా ఆశలు కల్పిస్తున్న బయోటెక్ డిగ్రీలు ఏ మేరకు ఉపకరిస్తాయి ` వంటి విషయాలపై నాతో చర్చ జరిపారు. ఆ విషయాలపై యిప్పటికీ నా అభిప్రాయాలు అవే కాబట్టి, మీతో పంచుకుంటున్నాను – మీలో ఎవరికైనా ఉపకరిస్తాయేమోనన్న ఆశతో!
ప్రశ్న 01. ఇతర దేశాలలో ఉన్నత విద్యకు, ఇక్కడి విద్యకు తేడా ఏమిటి?
జవాబు – ఇక్కడ మన సిలబస్ ఎప్పటికప్పుడు ఆధునీకరించరు. అంటే అప్‌డేట్ చేయరు. పైగా ఆచరణ యోగ్యంగా (అప్లికేషన్ ఓరియంటెడ్‌గా) వుండదు. అక్కడ అలా కాదు. ఎప్పటికప్పుడు తాజాగా మార్పులు చేస్తారు. చాలా లైవ్లీగా, ఆసక్తికరంగా వుండేట్లు చేస్తారు. ఏవో పుస్తకాలలో ఎకడమిక్స్ నేర్పేటట్లు కాకుండా వాటిని ఇండస్ట్రీలో ఏ విధంగా ఎడాప్ట్ చేసుకుంటారో సోదాహరణంగా చూపిస్తారు. మన వద్ద ఎడ్యుకేషనల్ టూరు అని చెప్పి బేలూరు, హళేబీడుకో, అజంతా ఎల్లోరాలకో తీసుకెళతారు. కానీ అక్కడ పరిశ్రమలకు తీసుకెళ్లి ఆధునిక యంత్రసామగ్రిని, అవి పనిచేసే విధానాన్ని చూపుతారు.
మన వద్ద ఉపాధ్యాయవర్గం (ఫ్యాకల్టీ) పుస్తకాల కోసం, పుస్తకాల చేత చేయబడిన పుస్తకాల మనుషులు. అందువలన ప్రాక్టికల్‌గా సమస్యలు ఎలా వస్తాయో, వస్తే వాటిని ఎలా పరిష్కరించాలో వారికి తెలియదు. అక్కడ ఫ్యాకల్టీని ఇండస్ట్రీ నుండి తీసుకుంటారు. వారు వారి అనుభవాలనుండి చెప్తూ వుంటే ఆసక్తికరంగా వుంటుంది. ఇంటరాక్టివ్‌గా వుండడం చేత విద్యార్థులు సందేహాలు లేవనెత్తుతారు, వీళ్లు తాము ఎందుకు అలా చేశారో సమాధానాలు చెప్తారు. అందువలన కాలేజీకి బయట ప్రపంచంలో ఎటువంటి వాతావరణం వుందో, దానిలో ఎలా మసలాలో విద్యార్థులకు ముందే ఒక అవగాహన ఏర్పడిపోతుంది.
ప్రశ్న 02. క్రియేటివ్, కాన్ఫిడెంట్, సక్సెస్‌ఫుల్ ఇండస్ట్రియలిస్టులను మన యూనివర్శిటీలు ఎందుకు తయారు చేయలేకపోతున్నాయి?
జవాబు – క్రియేటివిటీ వంటివి విద్యార్థులు పెరిగిన వాతావరణం, పెంపకం, స్వతహాగా వచ్చే లక్షణాలు యిటువంటి వాటిపై ఆధారపడతాయి. ఇక కాన్ఫిడెన్సు అంటారా, నేనిందాకా చెప్పినట్టు బుక్కిష్ నాలెజ్ కాకుండా ప్రాక్టికల్ నాలెజ్ యూనివర్సిటీ నుండి అలవరిస్తే వాళ్లకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఈత కొట్టేవాడు ఈతెలా కొట్టాలో పాఠం చెపుతూంటే మనకు ధైర్యం వస్తుంది. గట్టు మీదనే వుండిపోయిన వాడు ‘నువ్వు నీళ్లలోకి దిగు ఫర్వాలేదు’ అంటే నమ్ముతామా?
ఉదాహరణకి మన ఎకనమిక్స్ ప్రొఫెసర్ గారు ఎప్పుడూ బ్యాంకు నుంచి ఋణం తీసుకోలేదనుకోండి, ఆయనకు అసలు బాంకు ఎక్కవుంటే లేదనుకోండి, ఆయన ‘ఇండస్ట్రీ కోసం ఋణం తీసుకోవడం చాలా సులభం, ప్రభుత్వం చాలా స్కీములు ఏర్పరచింది’ అంటే నమ్మకం ఏర్పడుతుందా? బాంకు నుండి ఋణం తీసుకున్న ఎంట్రప్రెనార్ చెపితే మనకు వంటపడుతుంది.
ఏదైనా సరే డిస్కషన్ వలన విజ్ఞానం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఒక పారిశ్రామికవేత్త వచ్చి మనతో మాట్లాడుతూంటే, తన అనుభవాలు చెపుతూ వుంటే ఆ అనుభూతి వేరు. విద్యార్థులకే కాదు, ఆయనకూ అది ఉపయోగకరం. వీళ్లు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేయలేదు? అని లేవనెత్తే సందేహాల వలన రివర్స్ ఫ్లో ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఇటువంటివి జరగకుండా పలకా బలపం పట్టుకుని పాఠాలు చెప్పినట్టుగా చెపితే లాభం లేదు.
అసలు కాలేజీ లెవెల్ వచ్చేసరికే విద్యార్థులు వాళ్ల పాఠాలు వాళ్లు చదువుకుని అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ప్రొఫెసర్లు వాళ్లకు సందేహాలు వస్తే తీర్చే స్థాయిలో వుండాలి. అది కాకుండా ప్రొఫెసర్లు టెక్స్‌ట్ బుక్ చేతపట్టుకుని పాఠాలు చెపుతూ, అప్పచెప్పించుకుంటూ వుంటే అది చదువు కాదు. ప్రొఫెసర్లు సందేహాలు లేవనెత్తించాలి. లేవనెత్తించాలంటే పుస్తకాన్ని దాటి వెళ్లాలి, పుస్తకాల లోని సిద్ధాంతాలను అమలు చేస్తున్న అధికారులను, పారిశ్రామికవేత్తలను తీసుకుని వచ్చి విద్యార్థులతో సంధాన పరచాలి.
అసలు యివన్నీ చేయాలంటే కాలేజీలలో వసతులు వుండాలి. కనీస వసతులే లేవని పేపర్లలో చదువుతున్నాం. నాలుగైదు రూములు వుంటే చాలు వాటిల్లో కాలేజీ నడిపేయవచ్చు అనుకుంటున్నారు. లాబ్స్ లేవు, ప్లే గ్రౌండ్స్‌లేవు, లైబ్రరీలు లేవు. డబ్బు ఖర్చు పెట్టి యివన్నీ పెట్టినా వీటిని నిర్వహించగలిగిన ఉపాధ్యాయగణం ఏది?
ఫ్యాకల్టీ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. టీచింగ్ వృత్తి కిట్టుబాటుగా లేదు. కంప్యూటర్ బాగా వచ్చినవాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీరై నెలకు 50 వేలు సంపాదించుకునే అవకాశం వుంటే, టీచింగ్‌కి ఎందుకు వస్తాడు? అంటే టీచింగ్‌కి వచ్చేవాడు ద్వితీయ శ్రేణి కాండిడేట్ అన్నమాట. మరి అలాటివాడు ప్రథమ శ్రేణి విద్యార్థిని ఎలా తయారుచేయగలడు? జరగవలసినది సంపూర్ణ ప్రక్షాళన. మెటమార్ఫసిస్ జరగాలి. చదువు స్వరూపమే మార్చాలి. అప్లికేషన్ లక్ష్యంగా నూతన సిలబస్ ఏర్పడాలి.
ప్రశ్న 03. ఉన్నత విద్య మెరుగుపరచడానికి మీ సలహాలు ఏమిటి?
జవాబు – ఉన్నత విద్య అంటే యిక దాని తదుపరి అడుగు సమాజంలోకి వెళ్లిపోవడమే. సమాజంలోకి వెళ్లడానికి విద్యార్థిని సర్వసన్నద్ధం చేయడమే లక్ష్యంగా వుండాలి. మీరు మీ పిల్లవాణ్ని రైలెక్కించి వేరే ఊరు పంపాలి అంటే ఏం చేస్తారు? రైలు బొమ్మ గీసి చూపించి యింట్లో కూర్చోబెడతారా? లేదే! పెట్టే బేడా రెడీ చేయించి, టిక్కెట్టు కొని యిచ్చి, రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లి, దగ్గరుండి రైలు ఎక్కిస్తారు కదా! యూనివర్శిటీ విద్యార్థి అంటే అంత యిదిగా రెడీ చేయదగిన వాడు. అతన్ని అలా రెడీ చేయించడానికి, ప్రయాణంలో సామాన్లు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడడానికి, గమ్యం వచ్చినపుడు దిగడానికి, మధ్యలో యాక్సిడెంటు జరిగితే తనను తాను ఎలా కాపాడుకోవడానికి అతన్ని ఎలా తర్ఫీదు చేయాలో ఆలోచించి యూనివర్శిటీ విద్యార్థిని అలాగే తయారు చేయండి, చాలు.
ప్రశ్న 04. బయోటెక్ కాలేజీలు యిబ్బడిముబ్బడిగా పుట్టుకుని వచ్చి బయోటెక్ రంగంపై చాలా కలలు కల్పిస్తున్నాయి. అవి ఏ మేరకు సాకారమయ్యే అవకాశం ఉంది?
జవాబు – మొదట్లో బయోటెక్ రంగం గురించి చదువుకున్నవారికే తెలియదు. బాంకర్లు ఋణం యివ్వనన్నారు. వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రాలేదు. మా ప్రోడక్టు బయటకు రాగానే అంతా బయోటెక్, బయోటెక్ అనడం మొదలుపెట్టారు. పత్రికలు ఊదరగొట్టేశాయి. బయోటెక్ కంపెనీకి యిటుకలు సప్లయి చేసేవారిని కూడా బయోటెక్ పరిశ్రమలో భాగంగా లెక్కవేసి, ఇన్ని బిలియన్ డాలర్ల పరిశ్రమ అంటూ ప్రొజక్షన్లు చూపించారు. అందరూ ఎగబడ్డారు.
కానీ అందరూ గ్రహించవలసినది ఏమిటంటే, ఇది రిసెర్చి బేస్‌డ్ ఇండస్ట్రీ. కాలపరిమితి లేనిది. అనుకున్న వెంటనే ఫలితాలు రావు. ఓపిక పట్టాలి. ప్రభుత్వంలో ఉన్న వారికి దీనిపై అవగాహన లేదు. నియమనిబంధనలు క్రమక్రమంగా ఏర్పడుతున్నాయి. అనుమతి కోసం వెళ్లినపుడు అసలు సమస్య ఏమిటంటే లైసెన్సు లిచ్చే వారికి ఔషధాలపై అవగాహన లేకపోవడం. దాని దుష్పరిణామాలు ఎలా వుంటాయో తెలియక, ఊహించలేక అడ్డు చెపుదామని చూస్తారు. అందుకని నిర్ణయాలు ఆలస్యమవుతాయి.
భారతదేశపు మార్కెట్‌పై ఆశ పెట్టుకున్న విదేశీ కంపెనీలకు యిక్కడి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చి ధరలు తగ్గిపోవడం రుచించదు. అందువలన యిక్కడ జరిగిన గోరంత పొరబాట్లను కూడా కొండంత చేసి చూపిస్తుంది. మీడియాను ప్రభావితం చేస్తుంది. ఆ రిపోర్టులు చూసిన ప్రభుత్వాధికారులు అనుమతులివ్వడం మరింత జాప్యం చేస్తారు.
ప్రశ్న 05. ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు కదా!
జవాబు – ‘బిటి వంకాయ, బిటి పత్తి ` వీటన్నిటి వివాదాలతో బిటి అంటేనే ప్రజలలో భయం కలుగుతుంది. అన్ని బిటి ఉత్పాదనలను అడ్డుకోవాలని జన విజ్ఞానవేదిక, హక్కుల సంఘం వంటి వారు ఉద్యమిస్తారు. ఎన్‌జిఓలలో చాలాభాగం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నడుపుతారు. వారికి పరిపూర్ణ జ్ఞానం వుండదు. అసలే ప్రభుత్వానికి అలసత్వం, వాటికి తోడు యిలాటి వాతావరణం.
అడుగడుగునా అడ్డంకులు తగలడంతో బయోటెక్ ఉత్పాదన మార్కెట్‌లోకి రావడం ఆలస్యమవుతుంది. పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు వెనక్కి వెళతారు. పబ్లిక్ యిష్యూకి వెళితే బోల్డంత ధర పెట్టి షేర్లు కొన్నవారు నిరాశపడతారు. ఆశలు వేరు, ఆచరణ వేరు. కానీ సైన్సు పట్ల అవగాహన లేని మదుపర్లు నెల తిరిగేప్పటికి షేరు ధర పెరక్కపోతే దుష్ప్రచారం మొదలుపెడతారు
ప్రశ్న 06. బయోటెక్ కోర్సులలో చేరేవారికి మీరిచ్చే సలహా ఏమిటి?
జవాబు – ఐటీ, బిటీ అంటూ ప్రాస కుదిరింది కదాని ప్రభుత్వం బిటీ బిటీ అని జపం చేయడంతో ఇదీ ఐటీ లాటిదే అనుకుని జనాలు ఎగబడ్డారు. వారి క్రేజ్‌ను కాలేజీలు ఎన్‌క్యాష్ చేసుకున్నాయి.. ఓ తెలివైన గ్రాజువేట్ మూణ్నెళ్లలో కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోగలడు. కానీ బిటీలో ఓ సైంటిస్టు తయారవాలంటే కనీసం 15 సం॥ల చదువుండాలి. ఓర్పు, పరిశీలనా వుండాలి.
కాలేజీలు యివేమీ చెప్పకుండా భారీ డొనేషన్లు వసూలు చేసి విద్యార్థులను చేర్చుకున్నారు. ఫ్యాకల్టీకి కూడా ప్రాక్టికల్‌గా అనుభవం లేదు. కాలేజీల్లో లాబ్స్ లేవు. ఏ బిటి యూనిట్‌తోనూ అనుబంధం లేదు. గ్రాజువేట్‌లను తయారుచేసి ‘ప్రాజెక్టులు చేసుకు రండి’ అంటూ దేశం మీదకు తోలుతున్నారు. మా బోటి యూనిట్లపై ఒత్తిడి పడుతోంది. వీళ్లు పరికరాలు చూసైనా ఎరగరు. ఇక ఎలా హ్యేండిల్ చేయగలుగుతారు? ఎంత దేశభక్తి వుంటే మాత్రం ఏడాదికి ఎంతమందిని ట్రెయిన్ చేయగలం? ట్రెయినింగ్‌లో జరిగే నష్టాలకు ఎవర్ని బాధ్యులను చేస్తాం? కాలేజీలకు యివేమీ పట్టవు. కలలు అమ్మేసి వారిని గోతిలోకి దించారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎటు చూసినా బిటి విద్యార్థులే. ఎవరూ ఎంప్లాయబుల్ కాదు. ప్రభుత్వం అనవసరంగా తెచ్చిన హైప్ యిది. బిటిలో అన్ని వేకెన్సీలు లేవు. ఇది క్రమంగా ఎదగవలసిన పరిశ్రమ. ఈ విషయం తలిదండ్రులు విద్యార్థులు గుర్తెరిగితే మంచిది.’
ఇదీ ఆనాటి ఇంటర్వ్యూ. 18 ఏళ్ల తర్వాత, యిప్పటికీ వర్తిస్తోందంటే బాధగానే ఉంది. పరిస్థితులు మారాలి.
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
Well explained focusing on the fundamental issue. Politicians driven governments never focus on building the welfare from grass roots level, instead beating around the bush to create the hype with media management. Associated business men encash the opportunity leaving the public in waters. Unfortunate situation, unless combo of vision, educated and compassionated leader is seen.
vc available 9380537747
vc estanu 9380537747
Govt should make compulsory high school education for all children, so many problems will disappear.
Hindu society is always a knowledge society since Vedic times. Theoretically we are very strong compared to western students. Applied science, or engineering will kick start once the financial muscle of individuals improves. Our creative youth are poor, family oriented, and sentimental. They need to break some of it. My guess is, in next 10 years, we overtake China in patent filing.
Students are leaving India for many reasons, mainly for dollar value. The cream are leaving to get away from ill treatment due to reservations. Rich are leaving for a clean society and high end Medicare. Nice thing about Indians is all these people love India, and India is in their thoughts and prayers.
Mr. varaprasad reddy , This is going to happen with skill census and skill development program that was introduced by CBN in 2014 and as well as in 2024 again, you should tell this in last 5 yrs and you never did that with your reddy feeling, right?
SC: మేము వెనుకబడ్డవాళ్లం.
ST: మేమూ వెనుకబడ్డవాళ్లమే.
OBC: అరె మేమూ వెనుకబడ్డవాళ్లమేనయ్యా పుల్లారావ్.
Minority: యా అల్లా! మేమూ వెనుకబడ్డవాళ్లమే.
OC/EWS: మేమేం తక్కువా? మేమూ వెనుకబడ్డవాళ్లమేనోయ్..
India :ఇందుకే నేను వెనుకబడ్డ దేశాన్ని..అడుక్కు తినండి.
Agree with you, Sir. Education system in India is getting upgraded, but not up to the mark. Many more miles to go.. may be in next 30-40 years.
in 30-40 years we will become Nigeria or Lebanon. No future for India. It’s true.
ఎంత చదువు చదివి ఏమి ఉపయోగం, మంచి ,చెడు తెలియని మూకకి “ఎంజాయ్ అండ్ గంజాయి” ఉంటె చాలు. ఇక్కడే ఇబ్బడి ముబ్బడి గ ఉన్నారు.
బయోటెక్ , ప్రస్తుతం “భయం” టెక్ అని అంటారు.
గంజా*యి వనంలో తుల*సి మొక్క లాంటివి మీ ఆర్టికల్స్, ఈ వెబ్సైట్ లో.
పబ్లిక్ ఇష్యూ కి వెళ్లిన పెద్ద స్థాయి కంపనీ లో పని చేసే ఉద్యోగులకు,
తప్పనిసరిగా యునివర్సిటీ, కాలేజీలలో సంవత్సరానికి ఇన్ని గంటలు ప్రాక్టికల్ నాలెడ్జ్ బోధన చేయాలి అని రూల్ పెడితే
ఉభయ తారకం.
ఉదాహరణ: శాంత బయోటెక్ లో పని చేసే శాస్త్రవేత్తలు, మార్కెటింగ్ విభాగాల్లో పని చేసే వాస్తవ నాలెడ్జ్ వున్న వారు, సంవత్సరం లో కనీసం 10 గంటలు ( సుమారు నెలకి ఒక గంట ) పాటు , ఏదో ఒక బయో టెక్ బోధన చేసే కాలేజి లకి వెళ్లి తమకి తెలిసిన వాస్తవ సమాచారం నీ విద్యార్థులతో పంచుకోవాలి అని రూల్ పెడితే, చెప్పే వారికి ఉత్సాహంగా వుంటది, వినేవారికి నిజాలు తెలు స్థాయి.
worst article …
గంజా*యి వనంలో తులసి మొక్క లాంటివి మీ ఆర్టికల్.
PhD లు చేసిన వాళ్ళకి కూడా తమ సబ్జెక్టు మీద పట్టు వుండటం లేదు. తమ గైడ్ ల ఇళ్లలో పనులుచేసి PhD డిగ్రీ తెచ్చుకుంటున్నారు.
vc estanu 9380537747
Good One
great series