అదేంటో ప్రతిసారి నయనతారకే దొరికిపోతోంది నెట్ ఫ్లిక్స్. ఆమె నటించిన ఓ సినిమాతో ఆల్రెడీ సదరు ఓటీటీకి తల బొప్పికట్టింది. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన డాక్యుమెంటరీ కూడా పెద్దగా కలిసిరాలేదు.
“నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్” పేరిట డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. సాధారణంగా నయనతార సినిమాలకు నాన్-థియేట్రికల్ మార్కెట్ ఎంత పలుకుతుందో, దానికి 20 శాతం అదనంగా చెల్లించి మరీ ఈ డాక్యుమెంటరీ రైట్స్ దక్కించుకుంది. అయితే ఇక్కడితో కథ అయిపోలేదు.
డాక్యుమెంటరీకి నిండుతనం రావాలంటే ఆమె పెళ్లిని కూడా చొప్పించాలి. పెళ్లి వీడియోలు, ఫొటోలు వాడుకునేందుకు ఇంకొంత చెల్లించింది. ఈ మొత్తం అదనం. ఇంత డబ్బు చెల్లించినప్పటికీ ఆఖరి నిమిషంలో నెట్ ఫ్లిక్స్ కు కాపీరైట్ ఇబ్బందులు తప్పలేదు. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రయిలర్ లో 3 సెకెన్ల క్లిప్ వాడినందుకు 10 కోట్ల రూపాయలకు నోటీసు పంపించాడు ధనుష్.
ఇలా నయనతార పెళ్లి వీడియో, మరోవైపు ధనుష్ తో వివాదంతో ప్రచారం వచ్చినప్పటికీ ఈ డాక్యుమెంటరీ క్లిక్ అవ్వలేకపోయింది. నయనతారను లేడీ సూపర్ స్టార్ గా చూపించే ప్రయత్నమైతే సక్సెస్ ఫుల్ గా జరిగింది కానీ.. ఎక్కువ మంది ఆడియన్స్ ఆశించిన ఆమె ప్రేమకథలు, తెరవెనక కథల్ని మాత్రం డాక్యుమెంటరీలో ఇలా స్పృశించి అలా వదిలేశారు. ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. ధనుష్ ఎన్ఓసీ కూడా ఇవ్వనందున, కీలకమైన ‘నేనూ రౌడీనే’ చిత్రం క్లిప్పింగ్స్, మేకింగ్ వీడియోలు కూడా డాక్యుమెంటరీలో వాడలేకపోయారు. అది కూడా ఓ మైనస్.
అయితే నయనతార నుంచి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం నెట్ ఫ్లిక్స్ కు కొత్తేంకాదు. వాళ్లకు గతంలోనే అన్నపూరణి అనే సినిమాతో చాలా పెద్ద తగిలింది. నయన్ నటించిన ఈ సినిమా తీవ్రమైన చిక్కుల్లో పడింది. అందులో ఉన్న ఒకే ఒక్క సీన్ తో తలెత్తిన వివాదంతో నెట్ ఫ్లిక్స్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. దెబ్బకు ఆ కంటెంట్ ను తమ ఫ్లాట్ ఫామ్ నుంచి అప్పట్లో తీసేసింది. అంతేకాదు, దీనికి సంబంధించి కొంతమంది ఉద్యోగులపై కూడా వేటు పడింది.
ఇలా నయనతారతో నెట్ ఫ్లిక్స్ కు 2 చేదు అనుభవాలున్నాయి. రాబోయే రోజుల్లో నయనతార నుంచి ఏదైనా కంటెంట్ రైట్స్ దక్కించుకోవాలంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
deeniki kavalsina dabbulu mathram vachayi. Nayana Thara aunty happy ye ga
adi aunty…nuvvo chanti
Call boy jobs available 7997531004