పుష్ప 3 లో రష్మిక వుంటుందా?

పుష్ప 3 లో రష్మిక పాత్ర వుంటుందా? పుష్ప 2 తో ముగించేస్తారా? అన్న అనుమానాలు కూడా వున్నాయి

పుష్ప 1.. పుష్ప 2 రెండింటిలో హీరోయిన్ రష్మిక నే. నేషనల్ వైడ్ క్రేజ్ వున్న హీరోయిన్. అందులో డౌటే లేదు. సాధారణంగా క్రేజ్ కోసమైనా మరో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేస్తారు. కానీ దర్శకుడు సుకుమార్ అలాంటి పని చేయలేదు.

పుష్ప 2 కూడా కేవలం రష్మిక హీరోయిన్ గానే పూర్తి చేసారు. మరి ఇంతకీ పుష్ప 3 సంగతేమిటి? అప్పుడు కూడా కేవలం రష్మిక నే హీరోయిన్ గా వుంటుందా?

నిజానికి పుష్ప 3 ఇప్పట్లో వుండదు. త్రివిక్రమ్ సినిమా చేసిన తరువాత బన్నీ పుష్ప 3 మీదకు వచ్చే అవకాశం వుంది. అంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్లు ఆగాలి. అంటే 2026-2027 నాటి మాట. అంటే అప్పటికీ రష్మిక కు ఇదే క్రేజ్ వుంటుందా? కొత్త వాళ్లు ఎంతో మంది వస్తుంటారు కదా?

అసలు పుష్ప 3 లో రష్మిక పాత్ర వుంటుందా? పుష్ప 2 తో ముగించేస్తారా? అన్న అనుమానాలు కూడా వున్నాయి. పుష్ప 2 తో రష్మిక పాత్ర ముగిసిపోతుందనే గ్యాసిప్ లు వున్నాయి. లేదు, పుష్ప 2 పక్కా సుఖాంతం అనే మాటలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 లో హీరో హీరోయిన్లు 35 నుంచి 40 ఏళ్ల ఏజ్డ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. మరి పుష్ప 3 లో ఏం చేస్తారో చూడాలి.

3 Replies to “పుష్ప 3 లో రష్మిక వుంటుందా?”

  1. AA ప్రస్తుత వయస్సు 41. తన వయసుకి తగిన కేరక్టర్ నే కదా తను చేస్తుంది! 3వ part కి ఏం చేయాలో డైరెక్టర్ చూసుకుంటాడు లే, నువ్వు ఎక్కువగా feel అయ్యి,

Comments are closed.