అభిమానం చాటబోతున్న శ్రీకాంత్ ఓదెల

దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అభిమానం. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నానితో చేస్తున్నా దృష్టంతా మెగాస్టార్ తో సినిమా మీద వుంది. అందుకే ఇప్పుడు…

దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అభిమానం. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నానితో చేస్తున్నా దృష్టంతా మెగాస్టార్ తో సినిమా మీద వుంది. అందుకే ఇప్పుడు ఓ సినిమా ఫైనల్ చేసేసుకున్నాడు. ఇటీవలే శ్రీకాంత్ ఓదెల వెళ్లి మెగాస్టార్ ను కలిసి ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల రెగ్యులర్ సినిమా లు తీయరు. దసరా ఎంత రూటెడ్ గా వుందో ఇప్పుడు చేయబొయే నాని సినిమా కూడా అంతకన్నా నేటివ్ టచ్ తో వుండబోతోంది. మరి అలాంటిది మెగాస్టార్ తో ఎలాంటి సినిమా తీస్తారో అన్నది కాస్త ఆసక్తికరమే. ఎందుకంటే మెగాస్టార్ ఇలాంటి సినిమాలు చేస్తారా? స్వయంకృషి, రుద్రవీణ లాంటివి చేసారు. కానీ మరీ గ్రౌండెడ్ సినిమాలు కావు అవి.

ఇప్పుడు చేస్తున్న మేకింగ్ తో, ఎలాంటి లైన్,ఎలాంటి కథతో శ్రీకాంత ఓదెల ఓ సినిమాను మెగాస్టార్ తో చేస్తారు అన్నది చూడాలి. అలా అని తన రూట్ మార్చుకుని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తే జనం అంగీకరించుకోవచ్చు

2 Replies to “అభిమానం చాటబోతున్న శ్రీకాంత్ ఓదెల”

Comments are closed.