కూట‌మి స‌ర్కార్‌ను చావుదెబ్బ కొట్టిన వైసీపీ!

పెద్ద ఎత్తున కూట‌మి స‌ర్కార్ న‌మోదు చేస్తున్న కేసుల విష‌యంలో ఒకే ఒక్క ఘ‌ట‌న‌తో వైసీపీ చావు దెబ్బ కొట్టింది. తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎర్రావారిపాలెం మండ‌లంలోని య‌ల‌మంద ద‌ళిత విద్యార్థినిపై దాడి…

పెద్ద ఎత్తున కూట‌మి స‌ర్కార్ న‌మోదు చేస్తున్న కేసుల విష‌యంలో ఒకే ఒక్క ఘ‌ట‌న‌తో వైసీపీ చావు దెబ్బ కొట్టింది. తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎర్రావారిపాలెం మండ‌లంలోని య‌ల‌మంద ద‌ళిత విద్యార్థినిపై దాడి విష‌యంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదే కేసులో ఈ నెల ఒక‌టో తేదీన బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి, తాము చెవిరెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేద‌న్నారు. చ‌దువురాని త‌మ‌తో తెల్ల కాగితంపై పోలీసులు సంత‌కం చేయించుకున్నార‌ని చెప్పారు. తాము పిలిస్తేనే చెవిరెడ్డి మంచి చేయ‌డానికి వ‌చ్చాడ‌ని, అలాంటి వ్య‌క్తిపై కేసు ఎందుకు పెడ‌తామ‌ని త‌ల్లిదండ్రులు ప్ర‌శ్నించ‌డం పెద్ద మ‌లుపుగానే చెప్పాలి.

ఎందుకంటే మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని న‌డుపుతున్నార‌నే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. క‌క్ష‌పూరితంగా త‌మ‌పై కేసులు పెడుతున్నారంటూ వైసీపీ నేత‌లు నిత్యం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కూట‌మి స‌ర్కార్ త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించేలా య‌ల‌మంద ద‌ళిత విద్యార్థిని త‌ల్లిదండ్రులు మీడియా ముందు చెప్పిన అంశాలే నిద‌ర్శ‌నంగా నిలిచాయి.

అందుకే ద‌ళిత విద్యార్థిని త‌ల్లిదండ్రుల అభిప్రాయాల్ని దాచేందుకు ముఖ్యంగా రాజ‌గురువు ప‌త్రిక చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. తాను నిజం చెబితే త‌ప్ప‌, లోకానికి తెలియ‌ద‌ని అనుకునే స‌ద‌రు మీడియా… జిల్లా సంచిక‌లో అది కూడా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి విమ‌ర్శ‌లకు ప్రాధాన్యం ఇస్తూ, బాధితుల ఆవేద‌న‌ను తామ‌రాకుపై నీటిబొట్టులా రాసుకొచ్చింది. కూట‌మి స‌ర్కార్ చేసే త‌ప్పుల్ని ప‌రిర‌క్షించ‌డం త‌న క‌ర్త‌వ్యంగా చంద్ర‌బాబు భ‌గ‌వ‌ద్గీతగా భావించే ప‌త్రిక వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఏది ఏమైనా య‌ల‌మంద ద‌ళిత దంప‌తులు మీడియా ముందుకొచ్చి నిజాలు చెప్ప‌డం …రాష్ట్రంలో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు, నాయ‌కులపై న‌మోద‌వుతున్న కేసుల‌న్నింటిపై త‌ప్ప‌క ప్ర‌భావం చూపుతుంది. ఓహో కూట‌మి స‌ర్కార్ న‌మోదు చేస్తున్న కేసుల‌న్నీ ఇలాంటివే ఏమో అనే అనుమానం ప్ర‌జ‌ల్లో క‌లిగిస్తోంది. అందుకే కూట‌మి స‌ర్కార్ అన‌వ‌స‌ర కేసుల సంగ‌తి ప‌క్క‌న పెట్టి, ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే ప‌నుల‌పై దృష్టి పెట్ట‌డం మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

28 Replies to “కూట‌మి స‌ర్కార్‌ను చావుదెబ్బ కొట్టిన వైసీపీ!”

  1. Andhra lo andaru velli mano bavalu hurt ayay ani cases veyandi…crores of cases veyandi…vadebba…dikku malina cases lathoti arrest lu ela chesthado chuddam..intiki oka case veyandi…ucha karali yedava police and red book yedavalaki….

  2. నీ బొందరా అయ్యా

    వాడి ఇలాకా అది

    తేడా వస్తే మీ ఇద్దరూ పోతారంటే వీళ్ళు మాట మార్చి ఉంటారు

  3. ఇలా అనుకుని సంతోష పడండి . ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు ప్రజలకు తెలిసి వచ్చినందుకే కదా మీకు ఈ గతి పట్టింది . ఇలా చెప్పి ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు .

    అప్పుడు ఏదో అలా జరిగిపోయింది ఇప్పుడు అలా జరగడానికి అవకాశం లేదు కదా. మీ నీలి బుక్కు వాళ్ళు సాగించిన దమనకాండము ముందు ఇది ఎంత. మాట ఎత్తితే రెడ్బుక్ అంటున్నారు. మీ నీలి బుక్కు కన్నా రెడ్ బుక్ ఎక్కువ ఏం కాదులే

  4. హలో గ్రేట్ ఆంధ్రా ఈరోజు సుప్రీం కోర్టు సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ మీద ఏమి వ్యాఖ్యనించిందో చూశావా, లేకుంటే వైస్సార్సీపీ కి అనుకూలమైనవే చూస్తావా

  5. చావు దెబ్బ అంట అతనికి వాళ్ళ ఇష్యూ నీ వైసిపి వాళ్ళు రాజకీయం చేయడం గురించి అవగాహన ఉండి ఉండదు లేదా అతనికి డబ్బులిచ్చి అనుకూలంగా మాట్లాడించి ఉంటారు.. దీనికే చావు దెబ్బ అంట పొక్సో కేసు పెడితే కోర్టు లో వేస్తే కోర్టు ద్వారా కదా క్లారిటీ ఇప్పించాల్సింది హౌలేస్ 😆😆😆

  6. ఏంటి..దీనికే చావు దెబ్బ?

    ఇంట్లోనుంచి బయటికి రాకుండా, జనవరి చివర్లో

    వస్తా అన్నోడికి ఏ దెబ్బ పడిందంటావ్?

  7. Chedu tho friendship chestey eamoutundo Inka teleyataleda mee neeli patrikalu enka marava siggu lekunda chedu ku ela sahakarestunnaru oka neeli patrikal vari sontha baka meekemaiendi meeku entha muduthondi cheduku support cheyadaniki mana rashtram bagundalani anukondi kurchunna kommani narukkokandi chustunnavukada ekkadinundi ekkadiki vachado

  8. ఇప్పటికీ బుద్ధిరాలేదు అన్నమాట. కూటమి ప్రభుత్వం మంచి చేస్తే.. ఏడవడం ఆపేయండి ముందు. చావు దెబ్బ అని పెద్ద పెద్ద డైలాగు లు ఎందుకు? 11 తో చావు దెబ్బ ఎవరికో అందరికీ తెలుసు కదా. జోకులు ఆపండి ముందు.

Comments are closed.