ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో మ‌త‌ల‌బు?

కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డి ఆరు నెలలు దాటిపోయింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల్లో నెర‌వేరాల్సిన‌వి చాలా ఉన్నాయి. త‌మ‌కిచ్చిన హామీ సంగ‌తేంట‌ని వాలంటీర్లు ఇప్ప‌టికే రోడ్డెక్కారు. అంగ‌న్‌వాడీల ప‌రిస్థితి ఇంతే. 108 అంబులెన్స్ భ‌విష్య‌త్…

కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డి ఆరు నెలలు దాటిపోయింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల్లో నెర‌వేరాల్సిన‌వి చాలా ఉన్నాయి. త‌మ‌కిచ్చిన హామీ సంగ‌తేంట‌ని వాలంటీర్లు ఇప్ప‌టికే రోడ్డెక్కారు. అంగ‌న్‌వాడీల ప‌రిస్థితి ఇంతే. 108 అంబులెన్స్ భ‌విష్య‌త్ ఏంటో అర్థంకాక ఉద్యోగులు ఆందోళ‌న‌బాట ప‌ట్టారు. ఇక సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల అమ‌లు గురించి వైసీపీ నాయ‌కులు ప‌దేప‌దే ప్ర‌శ్నిస్తున్నారు. వాటి అమ‌లు కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌థ‌కాల‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ అనే అంశం తెర‌పైకి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిజంగా ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డానికి వారి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే అంత‌కంటే కావాల్సింది ఏముంటుంది? అయితే పాల‌కులు పైకి చెప్పేదొక‌టి, చేసేది మ‌రొక‌టి అనే ర‌కంగా ఉండ‌డం వ‌ల్లే ప్ర‌తిదీ అనుమానించాల్సి వ‌స్తోంద‌ని జ‌నం అంటున్నారు.

కూట‌మి స‌ర్కార్ అమలుచేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న త‌ర్వాతే ముందుకెళ్లాలని భావిస్తోందట‌. రానున్న రోజుల్లో ప్రభుత్వం అమలుచేసే పథకాలపై ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం (ఐవీఆర్‌ఎస్‌) ద్వారా ప్ర‌జాభిపాయాల్ని తెలుసుకోనుంది. అయితే లబ్ధిదారులకు మాత్ర‌మే నేరుగా ఫోన్‌ చేసి ప‌థ‌కాలు అమలవుతున్న తీరు, ఇత‌ర అంశాల‌పై వాస్త‌వాల్ని తెలుసుకోడానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని చెబుతున్నారు.

ఇసుక‌, మ‌ద్యం పాల‌సీల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఉచితంగా ఇసుక ఎక్క‌డా దొర‌క‌డం లేద‌ని అసెంబ్లీ స‌మావేశాల్లోనూ, అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి దృష్టికి కూట‌మి ఎమ్మెల్యేలు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయినా ఎలాంటి మార్పు రాలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా మ‌ద్యం దుకాణాలే క‌నిపిస్తున్నాయి. మ‌ద్యం విచ్చ‌ల‌విడిత‌న‌మైంది.

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌పై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పిఠాపురంలో ఏం చెప్పారో అంద‌రికీ తెలిసిందే. చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోయాయ‌ని స్వ‌యంగా ఉప ముఖ్య‌మంత్రే బ‌హిరంగంగా వాపోయారు. రేష‌న్ బియ్యం అక్ర‌మ త‌ర‌లింపుపై ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ రెండు రోజులుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇంత‌కంటే ప్ర‌జాభిప్రాయం ఏముంటుంది? చ‌ర్య‌లు తీసుకోవాల‌నే చిత్త‌శుద్ధి ప్ర‌భుత్వానికి వుంటే, ఏమీ తెలియ‌ద‌ని అనుకోలేం. కానీ మ‌రేదైనా మ‌న‌సులో పెట్టుకుని ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ అంటే మాత్రం భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వు. ఆ విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని న‌డుచుకుంటే మంచిద‌ని ప్ర‌జానీకం చెబుతోంది.

6 Replies to “ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో మ‌త‌ల‌బు?”

  1. ////ఇసుక మద్యం పాలసీల పై తీవ్ర వ్యతిరెకత కనిపిస్తుంది!////

    .

    ఒరె! నువ్వు చెప్పె అబద్ధాలకి హద్దె ఉండదా?

  2. ABN, Eenadu ఫ్రంట్ పేజీలో క్షమాపణ చెప్పకుంటే, ఒక కుక్క కూడా జగన్ అన్నకు మర్యాద ఇవ్వదని మతలబు.

  3. ABN, Eenadu ఫ్రంట్ పేజీలో క్షమాపణ చెప్పకుంటే, ఒక_కుక్క కూడా జగన్ అన్నకు మర్యాద ఇవ్వదని మతలబు.

  4. హామీ ఇచ్చేముందు “IVRS” తీసుకోవాలిసింది. ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం ఎందుకు?

  5. చంద్రబాబు గారు పవన్ గార్లు వాళ్ళు మండలం లో mro , పోలీస్ స్టేషన్ లలో ఇతర ప్రభుత్వ ఆఫీస్ లలో జరిగే అవినీతి అక్రమాల మీద వాళ్ళు ప్రతి మండలానికి ఒక వెబ్సైటు ఓపెన్ చేసి ప్రజలు ఆన్లైన్ లో పిర్యాదులు చేసే వ్యవస్థను పెట్టాలి వాళ్ళు వచ్చిన కంప్లైంట్ ల ను విచారిస్తే కూటమి కి తిరుగుండదు

Comments are closed.