చినబాబు మీద తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు ప్రత్యేక అభిమానం ఉంది. పార్టీలో కొత్త తరం నేతలు అంతా మంత్రి నారా లోకేష్ బృందంగా ఉంటున్నారు. వారిని ఎంచి మరీ కీలక స్థానాల్లో ఎంపిక చేసే విషయంలో లోకేష్ కీలకంగా ఉంటున్నారు అని అంటున్నారు.
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా పార్టీలో యువ నేత ఎంవీ ప్రణవ్ గోపాల్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవి టీడీపీకి చెందిన యువ నాయకుడికి దక్కడం విశేషం.
ఈ పదవి కోసం కూటమిలో ఎందరో ప్రయత్నాలు చేశారు. చాలా మంది సీనియర్లు కూడా ఆశలు పెంచుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రణవ్ గోపాల్‌కి ఈ అవకాశం దక్కింది. ఆయన పార్టీలో యువ నేతగా ఉంటూ వస్తున్నారు. అయిదేళ్లుగా వైసీపీ మీద చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈ పదవి దక్కిందని అంటున్నారు.
ఆయనను ముందుకు తీసుకుని రావాలని టీడీపీకి కొత్త రక్తం అందించాలని చినబాబు భావించారని అంటున్నారు. అందుకే లోకేష్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వీఎంఆర్డీఏ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలను ప్రణవ్ పెట్టడం ద్వారా తన భక్తిని చాటుకున్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ప్రణవ్ గోపాల్‌కు రాజకీయంగా ఇది మంచి అవకాశం అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది అని చెబుతున్నారు. అందువల్ల కీలకమైన పదవిలో ఉన్న ప్రణవ్ గోపాల్‌కు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నారు. చినబాబు మంచి గైడ్‌గా ఉండటం శుభ పరిణామమని అంటున్నారు.
Call boy jobs available 7997531004