హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌కు షాక్‌!

తెలంగాణ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి గ‌ట్టి షాక్ త‌గిలింది. త‌న‌పై న‌మోదైన కేసును క్వాష్ చేయాల‌ని ఆయ‌న న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ల‌గ‌చ‌ర్ల‌లో ఫార్మా సంస్థ‌ల…

తెలంగాణ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి గ‌ట్టి షాక్ త‌గిలింది. త‌న‌పై న‌మోదైన కేసును క్వాష్ చేయాల‌ని ఆయ‌న న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ల‌గ‌చ‌ర్ల‌లో ఫార్మా సంస్థ‌ల ఏర్పాటుకు భూసేక‌ర‌ణ చేయాల‌ని ప్ర‌భుత్వం త‌ల‌పెట్టింది. అయితే ల‌గ‌చ‌ర్లలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ సంద‌ర్భంగా తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కుంది.

వికారాబాద్ క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్‌జైన్‌తో పాటు ముఖ్య‌మైన అధికారుల‌పై గ్రామ‌స్తులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న వెనుక మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి ఉన్నార‌నే కార‌ణంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. అలాగే ఆయ‌న్ను జైల్లో వేశారు. అయితే త‌న‌కు సంబంధం లేద‌ని, కేసును క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఆయ‌న గ‌త నెల 14న పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇవాళ తీర్పు వెలువ‌డింది. న‌రేంద‌ర్‌రెడ్డిపై కేసు కొట్టేసేందుకు హైకోర్టు నిరాక‌రించింది. ఆయ‌న పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం కొట్టేసింది. దీంతో ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి కేసును ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి. మ‌రోవైపు భూసేక‌ర‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను వెన‌క్కి తీసుకుంది. అయిన‌ప్ప‌టికీ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు భారీ మొత్తంలో డ‌బ్బు ఇస్తామ‌ని ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. రానున్న రోజుల్లో భూసేక‌ర‌ణ ఎక్క‌డ చేస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

3 Replies to “హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌కు షాక్‌!”

Comments are closed.