మొత్తానికి క్రిస్మస్ బరి నుంచి నితిన్ ‘రాబిన్ హుడ్’ తప్పుకున్నాడు. ఈ మేరకు ఇటు హీరో వర్గాలు, అటు నిర్మాణ వర్గాలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త డేట్ ఏమిటన్నది చూడాలి.
క్రిస్మస్‌కి రావాల్సిందే అని హీరో నితిన్ ఎంత పట్టుపట్టినా ప్రయోజనం లేకపోయినట్లు తెలుస్తోంది. పైగా, దానికి తోడు వర్క్ పూర్తి కాలేదు. పబ్లిసిటీ స్టార్ట్ కాలేదు. అందువల్ల సినిమా క్రిస్మస్‌కి రావడం కష్టం అని డిసైడ్ అయిపోయారు. ఆ మేరకు అంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఎప్పుడు విడుదల అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. సంక్రాంతికి రావాలని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన రంగంలోకి దిగినట్లు సమాచారం. సంక్రాంతికి ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అన్నీ దిల్ రాజు కాంపౌండ్ సినిమాలు. మైత్రీ కాంపౌండ్ సినిమా ఒక్కటీ లేదు. అందువల్ల సుధాకర్ రెడ్డి పాయింట్‌కు ప్రామాణికత ఉంది.
కానీ సమస్య ఏమిటంటే, సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా ఉంది. చరణ్ తదుపరి సినిమా మైత్రీలోనే ఉంది, సుకుమార్ డైరెక్షన్‌లో. అలాగే, సంక్రాంతికి బాలకృష్ణ సినిమా కూడా ఉంది. ఆ ఇద్దరి హీరోలతో మైత్రీకి మొహమాటాలు ఉంటాయి. ఇప్పుడు తమ సినిమాకు తెచ్చి వేసారనే భావన హీరోల్లో కలిగితే, మైత్రీకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల సంక్రాంతికి రాకుండా ఉండేందుకు మైత్రీ నిర్మాతలు మాక్సిమమ్ ట్రై చేసే అవకాశం ఉంది. లేదంటే సంక్రాంతికే రావాలని డిసైడ్ అయితే, సినిమాల పరంగా కాకపోయినా బ్యానర్ల పరంగా రంజుగా ఉంటుంది.
క్రిస్మస్ బరి నుండి ఔటైతే అయ్యాడు పర్లేదు, కానీ మెలమెల్లగా ప్రేక్షకుల దృష్టి నుండి ఔటవుతున్నాడు
దాని గురించి ఆలోచించి మంచి సినిమాలు చేయడం మేలు.