తేడా జరిగితే నా జీవితం గుడ్డిదయ్యేది – మోహన్ బాబు

నా ఇంటి లోపలకు, గేట్లు తోసుకుంటూ వచ్చి నా మనశ్శాంతిని భగ్నం చేశారు

న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనపై స్పందించారు మోహన్ బాబు. చేయి చేసుకోవడం తన తప్పిదమేనని అంగీకరించి, చింతిస్తున్నానని తెలిపిన మోహన్ బాబు.. ఆ టైమ్ లో కాస్త అటుఇటుగా ఏమైనా జరిగితే తన జీవితం గుడ్డిదయ్యేదని అన్నారు.

“గేటు తోసుకొని లోపలకు వచ్చినవాళ్లంతా మీడియా వాళ్లేనా లేక నాపై పగతో ఇంకెవరినై వచ్చారా అనే సందేహం. అంతేతప్ప, వాళ్లను కొట్టాలనే ఆలోచన నాకు లేదు. అతడ్ని నేను కొట్టానని చెబుతున్నారు తప్ప, ఆ టైమ్ లో మైక్ తెచ్చి నా నోట్లో పెట్టారు. నా కన్ను పోవాల్సింది. కంటి కింద కొంచెం తగిలి నేను ఎస్కేప్ అయ్యాను. లేదంటే నా జీవితం గుడ్డిదయ్యేది.”

ఆ చీకట్లో మైక్ లాక్కోవడం, ఆ వేడిలో ఘర్షణ జరిగింది వాస్తవమేనని అంగీకరించిన మోహన్ బాబు.. తన దెబ్బ అతడికి తలిగి ఉండొచ్చని అన్నారు. దానికి బాధపడున్నానని తెలిపిన ఈ నటుడు.. నిజజీవితంలో తనకు నటించాల్సిన అవసరం లేదన్నారు.

“గేటు బయట కొట్టినట్టయితే నాపై వంద కేసులు పెట్టి, నన్ను అరెస్ట్ చేయొచ్చు. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు పోయి లొంగిపోతాను కూడా. కానీ నా ఇంటి లోపలకు, గేట్లు తోసుకుంటూ వచ్చి నా మనశ్శాంతిని భగ్నం చేశారు. ఆల్రెడీ నా బిడ్డ మనోజ్ ఆ పని చేస్తున్నాడు. మీడియా కూడా తోసుకొచ్చింది. ఆ టైమ్ లో లోపలకొచ్చింది జర్నలిస్టా కాదా అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది. చీకట్లో అలా జరిగిపోయింది. దానికి చింతిస్తున్నాను.”

తలుపులు బద్దలుకొట్టుకొని తన ఇంటికి మీడియా రావడం న్యాయమా అని ప్రశ్నించారు మోహన్ బాబు. ఇంటిలోపలకొచ్చి తన ఏకాగ్రతను, మనశ్శాంతిని భగ్నం చేసే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు.

6 Replies to “తేడా జరిగితే నా జీవితం గుడ్డిదయ్యేది – మోహన్ బాబు”

  1. Enni cheppina trespassing is a crime. vaadi permission lekunda Government order lekunda vere ilalloki velladam crime. Daaniki avatali vaadu tannadu ante adi too much.

  2. ఏమి చెప్పగలం? ఒక వ్యక్తి ఇంట్లోకి బయటివాడు తలుపులు తోసుకుని వచ్చేయడం తప్పే. కానీ ఆ బయట వాళ్ళని తీసుకువచ్చినవాడు కూడా సొంత కొడుకే.

    ఆ కుటుంబం మధ్య గొడవల్లో విలేఖరులు దెబ్బలు తినాల్సి వచ్చింది.

Comments are closed.