ఆ సినిమా.. ముందుకు.. వెనక్కు

కొన్ని సినిమాలు అంతే. ముహూర్త బలం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతుంది.

కొన్ని సినిమాలు అంతే. ముహూర్త బలం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతుంది. చాలా ఏళ్లు స్ట్రగుల్ పడి, సడెన్‌గా బ్లాక్‌బస్టర్‌తో క్రేజీ హీరో అయిపోయాడు అతగాడు. తరువాత మళ్లీ మరో సినిమా చేసి టాప్ లైన్‌లోకి చేరిపోయాడు. కానీ ఆ తరువాత చేస్తున్న రెండు సినిమాలు మాత్రం నత్త నడక నడుస్తున్నాయి. వాటిలో ఒక సినిమా ముందుకు, వెనక్కు నడుస్తూ, ఎప్పటికి పూర్తవుతుంది అనేట్లుగా ఉంది.

సీన్ ప్రిపేర్ చేయడం, హీరో ఇది బాలేదు ఇలా మార్చు, అలా మార్చు అనడం, సరే మార్చుకుని వస్తానని డైరెక్టర్ వెళ్లడం, వారం తరువాత వచ్చి, లేదు తాను రాసిందే బాగుంది అనడం, డిస్కషన్లు ఇలా సాగిపోతున్నాయి. హీరో మరీ ఇన్వాల్వ్ అయిపోతున్నారని, అన్నింట్లో కాళ్లు, వేళ్లు పెట్టేస్తున్నారని దర్శకుడు బాధపడుతున్నారట.

కానీ హీరోకి క్రేజ్ ఉండటం, రైటింగ్ స్కిల్స్ ఉండడంతో నిర్మాత కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేకపోతున్నారు. దీంతో టైమ్ గడిచిపోతోంది కానీ సినిమా పూర్తి కావడం లేదు. సహజంగానే ఖర్చులు, వడ్డీలు పెరిగిపోతాయి. మళ్లీ అదో టెన్షన్. ఎప్పటికి పూర్తయి బయటకు వస్తుందో ఈ సినిమా.

One Reply to “ఆ సినిమా.. ముందుకు.. వెనక్కు”

Comments are closed.